Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్ మీ నుంచి 5జీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ సంగతేటంటే?

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (16:31 IST)
Redmi Note 9 Pro 5G
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ రెడ్ మీ నుంచి 5జీ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 26న చైనాలో విడుదల చేసింది. రెడ్‌మి నోట్ 9 4జీ, రెడ్‌మి నోట్ 9 5జీ, రెడ్‌మి నోట్ 9 5జీ ప్రో స్మార్ట్‌ఫోన్ల‌ను చైనాలో విడుదల చేసింది. డిసెంబర్ 1 నుండి కొనుగోలుకు ఇవి అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. కానీ భారత్ లో ఎప్పుడు విడుదల చేస్తారో ఇంకా ప్రకటించలేదు. 
 
రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ ఫీచర్స్ సంగతికి వస్తే..?
రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌పై పని చేయనుంది.
1080p రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ తో 6.67-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది.
 
ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఐసోసెల్ హెచ్‌ఎం 2 సెన్సార్‌తో నిర్మించబడింది. ఇతర కెమెరాల విషయానికి వస్తే 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2-కెమెరా మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది.

సంబంధిత వార్తలు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments