Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత విపణిలోకి రియల్ మీ C20A.. ఫీచర్స్ ఇవే..

Webdunia
బుధవారం, 12 మే 2021 (11:26 IST)
Realme C20A
భారత్‌లో అత్యుత్తమ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ మంచి విక్రయాలు సాధిస్తున్న సంస్థ రియల్ మీ. ఈ ఏడాది ఇప్పటికీ రియల్ మీ C11 మోడల్‌ను భారత విపణిలో లాంచ్ చేసింది. తాజాగా మరో సరికొత్త ఫోన్‌తో ముందుకు వచ్చింది. అదే రియల్ మీ C20A. 
 
అయితే ఈ ఫోన్‌ను ముందు బంగ్లాదేశ్ లో విడుదల చేసింది. భారత్‌లో ఎప్పుడు వస్తుంది అనే అంశంపై స్పష్టత లేదు. ఇటీవలే ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్ను కూడా ఆవిష్కరించిందీ కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్ 20:9 డిస్ ప్లే కాన్ఫిగరేషన్ తో పాటు మీడియాటెక్ హెలీయో జీ35 SoC తో అందుబాటులోకి వచ్చింది. 
 
ఈ స్మార్ట్ ఫోన్ ముందు, వెనక సింగిల్ కెమెరా సెన్సార్ ఉంది. అంతేకాకుండా డెడికేటేడ్ మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ తో అందుబాటులోకి వచ్చింది. వాటర్ డ్రాప్ స్టైల్ డిస్ ప్లేను కలిగి ఉన్న ఈ ఫోన్ లో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఐరన్ గ్రే, లేక్ బ్లూ రంగుల్లో దీన్ని సొంతం చేసుకోవచ్చు.
 
రియల్ మీ సీ20ఏ స్పెసిఫికేషన్లు
 
రెండు సిమ్(నానో) ఆప్షన్‌ను కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్లో ఆండ్రాయిడ్ 10 వర్షన్ ను పొందుపరిచారు. అంతేకాకుండా రియల్ మీ యూఐతో పనిచేస్తుంది. ఈ ఫోన్ 20:9 డిస్ ప్లే కాన్ఫిగరేషన్ ను కలిగి ఉండి 6.5 అంగుళాల(720X1600 పిక్సెల్) HD స్క్రీన్ తో అందుబాటులోకి వచ్చింది. 
 
అంతేకాకుండా ఆక్టాకోర్ మీడియా టెక్ హెలీయో జీ 35 SoCతో పాటు 2జీబీ ర్యామ్ తో పనిచేస్తుంది. ఫోటోలు, వీడియోల కోసం 8 మెగా పిక్సెల్ రియర్ కెమేరాతో ఎఫ్/2.0 లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ను కలిగి ఉంది. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ తో పాటు ఎఫ్/2.2 లెన్స్ ఫ్లాష్ ను పొందుపరిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments