Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాకిచ్చిన పేటీఎం... ఎలాగంటే?

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న వాటిలో పేటీఎం కూడా ఒకటి. ఇపుడిది క్రెడిట్ కార్డు వినియోదారులకు తేరుకోలేని షాకిచ్చింది. క్రెడిట్ కార్డ్ ద్వారా పేటీఎం వ్యాలెట్‌లోకి నగదు డిపాజిట్ చేసుకుని, దాన్ని

Webdunia
గురువారం, 9 మార్చి 2017 (14:30 IST)
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న వాటిలో పేటీఎం కూడా ఒకటి. ఇపుడిది క్రెడిట్ కార్డు వినియోదారులకు తేరుకోలేని షాకిచ్చింది. క్రెడిట్ కార్డ్ ద్వారా పేటీఎం వ్యాలెట్‌లోకి నగదు డిపాజిట్ చేసుకుని, దాన్ని బ్యాంకు ఖాతాలోకి మళ్లించుకునే వినియోగదారులకు 2 శాతం ట్రాన్స్‌ఫర్ ఛార్జి విధించనున్నట్టు ప్రకటించింది. ఈ చార్జి బుధవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు పేటీఎం తెలిపింది. 
 
నిజానికి పేటీఎంలో ఉచితంగా నగదు బదిలీ చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఎక్కువ మంది క్రెడిట్ కార్డు వినియోగదారులు పేటీఎం వాలెట్‌లోకి మనీ యాడ్ చేసుకుని, ఆ డబ్బును తిరిగి ఇతర బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసుకుంటున్నారు. అందరూ ఇదే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. 
 
దీన్ని నిలువరించే చర్యల్లో భాగంగా, ఈ ట్రాన్స్‌ఫర్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. క్రెడిట్ కార్డ్ ద్వారా పేటీఎం వ్యాలెట్‌లో మనీ యాడ్ చేసుకుంటే 2 శాతం చార్జీ విధించనున్నట్లు పేటీఎం తెలిపింది. 
 
అయితే వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ 2 శాతం విధించిన చార్జి తిరిగి కూపన్స్ రూపంలో వినియోగదారుడికి చేరుతుందని పేటీఎం సంస్థ పేర్కొంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా పేటీఎం వ్యాలెట్‌ను రీచార్జ్ చేసే వారికి ఈ చార్జీలు వర్తించవని సంస్థ స్పష్టం చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments