Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒప్పో రెనో 5ఏ స్మార్ట్‌ఫోన్.. వెనకవైపు నాలుగు కెమెరాలు

Webdunia
శనివారం, 22 మే 2021 (11:52 IST)
Oppo Reno5 A
ఒప్పో రెనో 5ఏ స్మార్ట్ ఫోన్ జపనీస్ మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు 64 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది. బ్లాక్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇది ప్రస్తుతానికి జపాన్‌లో మాత్రమే లాంచ్ అయింది. 765జీ స్నాప్ డ్రాగన్, 90హెచ్ డిస్ ప్లేను ఈ ఫోన్ కలిగివుంటుంది
 
మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి.
 
వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. 
 
ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 
 
5జీ, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5, 3.5 ఎంఎం ఆడియో జాక్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments