Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒప్పో A53s పేరుతో 5G స్మార్ట్​ఫోన్​... ఫీచర్స్ ఇవే...

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (17:39 IST)
Oppo A53s 5G
భారతదేశంలో అతి త్వరలోనే 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు అన్ని స్మార్ట్​ఫోన్​ బ్రాండ్లు వరుసగా 5జీ ఫోన్లను లాంఛ్​ చేస్తున్నాయి. తక్కువ ధరకే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన స్మార్ట్​ఫోన్లను మార్కెట్​లోకి విడుదల చేస్తున్నాయి. 
 
తాజాగా, ప్రముఖ స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​ ఒప్పో A53s పేరుతో 5G స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది. ఈ స్మార్ట్​ఫోన్​ అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్​కార్ట్​లో ప్రారంభమయ్యాయి. కేవలం రూ.15,000లోపు 5జీ సపోర్ట్​తో పాటు అద్భుతమైన ఫీచర్లను అందించడం విశేషం.
 
ఒప్పో A53s 5G స్మార్ట్​ఫోన్​లో​ 6.52 అంగుళాల హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లేను అందించింది. ఈ డిస్​ప్లే 60 హెర్ట్జ్​ రిఫ్రెష్​ రేట్​ కలిగి ఉంటుంది. మంచి 5జీ పర్ఫార్మెన్స్​ అందించగల, మీడియా టెక్ డైమెన్సిటీ 700 SoC ఆక్టాకోర్ ప్రాసెసర్​తో ఇది పనిచేస్తుంది. దీంట్లో 8GB ర్యామ్, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్​ను అందించింది. 
 
యాప్​లను స్పీడ్​గా రన్​ చేసేందుకుల 'ర్యామ్ ఎక్స్‌పాన్షన్'ను కూడా పొందుపర్చింది. అయితే, ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందనే విషయంపై ఇంకా స్పష్టతనివ్వలేదు. 
 
ఇక కెమెరా​ విషయానికి వస్తే.. దీని వెనుక 13 ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్​ను చేర్చింది. ఈ ట్రిపుల్ రియర్​ కెమెరాలో f/22 ఎపర్చర్​ కలిగిన ఒక 13 ఎంపి మెయిన్​ కెమెరా, 2 ఎంపి సెకండరీ కెమెరా, 2 ఎంపి మ్యాక్రో సెన్సార్​ కెమెరాలను చేర్చింది. దీనిలో వాటర్‌డ్రాప్ తరహా సెల్ఫీ కెమెరాను కూడా అందించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments