Webdunia - Bharat's app for daily news and videos

Install App

నుబియా నుంచి కొత్త రెడ్ మ్యాజిక్ 5ఎస్.. మార్కెట్లోకి మరో 5జీ గేమింగ్ ఫోన్..

Webdunia
గురువారం, 30 జులై 2020 (19:02 IST)
Nubia RedMagic 5S
ప్రముఖ గేమింగ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నుబియా తన కొత్త ఫోన్ రెడ్ మ్యాజిక్ 5ఎస్‌ను లాంచ్ చేసింది. తొలుత ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. రెడ్ మ్యాజిక్ 5జీ, రెడ్ మ్యాజిక్ 5జీ లైట్‌ల తర్వాత ఆ సిరీస్‌లో ఈ ఫోన్ లాంచ్ అయింది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో అప్ గ్రేడెడ్ కూలింగ్ సిస్టం ఐస్ 4.0ను కూడా అందించారు. 
 
ఇందులో వెనకవైపు 64 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఐస్ విండ్, సైబర్ నియాన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన సేల్ మొదట ఆగస్టు 1వ తేదీన చైనాలో జరగనుంది. అలాగే స్మార్ట్ ఫోన్ కూల్ చేయడానికి అవసరమైన డాక్ కూలింగ్ యాక్సెసరీని కూడా ఇందులో అందించనున్నారు. దీని ధర సుమారు రూ.1,900గా ఉంది. ఈ ఫోన్ మిగతా దేశాల్లో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియాల్సి ఉంది. 
 
ఫీచర్లు.. 
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత నుజియాయూఐ (రెడ్ మ్యాజిక్ ఓఎస్) ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. 
ఇందులో 6.65 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు.
ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.
 
16 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండటం విశేషం. 
ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. 
 
వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్686 సెన్సార్ అందుబాటులో ఉంది.
దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments