Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోనే 5జీ టెక్నాలజీ పరికరాలు.. నోకియా ప్రకటన

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (16:21 IST)
నోకియా కీలక విషయాన్ని తెలిపింది. భారత్‌లోనే 5జీ టెక్నాలజీ పరికరాలను తయారు చేయడం ప్రారంభించినట్లు పేర్కొంది. వీటిని ఇప్పటికే 5జీ వినియోగానికి శరవేగంగా ఏర్పాటు చేస్తున్న దేశాలకు తరలిస్తున్నట్లు పేర్కొంది. భారత్‌లో 5జీ న్యూ రేడియో తయారు చేసిన సంస్థగా నోకియా నిలిచింది. తాజాగా నోకియా ఎయిర్‌స్కేల్‌ మాసివ్‌ మల్టిపుల్‌ ఇన్‌పుట్‌ మల్టిపుల్‌ ఔట్‌పుట్‌ (ఎంఐఎంవో) పరికరాలు కూడా సిద్ధం చేసినట్లు కంపెనీ పేర్కొంది.
 
మరోవైపు భారత్‌లో 5జీ సర్వీసుకు టెలికమ్‌ ఆపరేటర్లకు అవసరమైన స్పెక్ట్రమ్‌ను వేలం వేయాల్సి ఉంది. కాగా భారత్‌లో తొలి 5జీ ఎన్ఆర్ తయారీ సంస్థ మాదేనని నోకియా సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌, భారతీయ మార్కెటింగ్‌ విభాగం హెడ్‌ సంజయ్‌ మాలిక్ తెలిపారు.  
 
అత్యుత్తమ స్థాయి పరికరాల తయారీలో భారత్‌ శక్తిని వెల్లడించాయి. భారతీయ టెలికమ్‌ ఆపరేట్లర్లు 5జీ సేవలు అందించడానికి ఇవి సహకరిస్తాయి. నోకియా చెన్నై ఫ్యాక్టరీ అత్యాధునిక 5జీ మాసీవ్‌ ఎంఐఎంవో పరికరాలు తయారు చేసి ఎగుమతి చేస్తోంది. 2008 నుంచి ఆ ప్లాంట్‌లో దాదాపు 50 లక్షల టెలికం పరికరాలను తయారు చేశాం. వీటిని దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేశామని మాలిక్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

ప్రభాస్-అనుష్క పెళ్లి.. ఇష్టపడితే వద్దంటామా.. శ్యామలా దేవి

హారర్, కామెడీ తో ఓ మంచి ఘోస్ట్ రాబోతుంది

న్యూ లుక్ తో వరుణ్ తేజ్..మట్కా తాజా షెడ్యూల్ జూన్ 19 నుంచి ప్రారంభం

భారతీయుడు 2 నుంచి తాత వస్తాడే సాంగ్ ప్రోమో విడుదల

8 వసంతాలు చిత్రంలో శుద్ధి అయోధ్యగా అనంతిక సనీల్‌కుమార్‌

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

మలబార్ స్పెషల్.. మత్తి చేపల పులుసు.. మహిళలకు ఎంత మేలంటే?

తర్వాతి కథనం
Show comments