Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్-బీఎస్ఎన్ఎల్‌లో కలిసి నోకియా సూపర్ ప్లాన్.. 5జీ కనెక్టివిటీకి సన్నాహాలు

ఎయిర్ టెల్ సహా శాంసంగ్, రిలయన్స్ జియోలు కూడా 5జీ నెట్ వర్క్‌ను మనదేశంలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా దేశీయ టెలికామ్ దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌తో కలిసి 5జీ

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (13:57 IST)
ఎయిర్ టెల్ సహా శాంసంగ్, రిలయన్స్ జియోలు కూడా 5జీ నెట్ వర్క్‌ను మనదేశంలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా దేశీయ టెలికామ్ దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌తో కలిసి 5జీ కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చే యోచనలో నోకియా ఉంది. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన ఎంఓయూపై నోకియా సంతకం కూడా చేసింది. 
 
5జీ కనెక్టివిటీ లాంఛింగ్‌పై నోకియా భారత మార్కెట్ హెడ్ సంజయ్ మాలిక్ స్పందిస్తూ.. ప్రస్తుతం 5జీ కనెక్టివిటీకి సంబంధించి భారతీ ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్‌లో సన్నాహక దశలో ఉన్నామన్నారు. ఇందుకోసం బెంగళూరులోని తమ ఆర్ అండ్ డీ సెంటర్లో ఓ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
 
భారత్‌లో 5జీ ప్రాధాన్యత.. వాటాదారుల అవసరాల రీత్యా ఈ సెంటర్‌ను ఉపయోగపడుతుందని సంజయ్ తెలిపారు. దేశంలో ఈ కొత్త టెక్నాలజీని త్వరగా ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, 2022 కల్లా ఇది జరగవచ్చునని చెప్పారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments