Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ మార్కెట్లోకి ఫీచర్ ఫోన్ 3310.. దేశంలో లేదా చైనాలో తయారీ

భారత్ మార్కెట్లోకి ఫీచర్ ఫోన్ 3310తో పాటు హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 3, నోకియా 5, నోకియా 6 ఫోన్లను విడుదల చేసేందుకు నోకియా రెడీ అవుతోంది. బార్సిలోనాలో జరుగుతున్న వరల్డ్ మొబైల్ కాంగ్రెస్‌లో ఈ ఫోచర్ ఫోన్‌న

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (12:11 IST)
భారత్ మార్కెట్లోకి ఫీచర్ ఫోన్ 3310తో పాటు హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 3, నోకియా 5, నోకియా 6 ఫోన్లను విడుదల చేసేందుకు నోకియా రెడీ అవుతోంది. బార్సిలోనాలో జరుగుతున్న వరల్డ్ మొబైల్ కాంగ్రెస్‌లో ఈ ఫోచర్ ఫోన్‌ను నోకియా ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఫోన్లను భారత్‌ మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు హెచ్ఎండీ గ్లోబల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అజయ్ మెహతా పేర్కొన్నారు.
 
మే చివరి వారం లేదంటే జూన్ తొలి వారంలో భారత విపణిలోకి విడుద చేస్తామంటూ అజయ్ మెహతా తెలిపారు. ఆండ్రాయిడ్ ఫోన్ కన్నా ముందే 3310ను భారత్ మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు. ఈ ఫోన్లన్నీ భారత్‌లోనే తయారు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇందుకోసం ఫాక్స్‌కాన్‌తో కలిసి పనిచేస్తామని, వారు కాదంటే వియత్నాం, లేదంటే చైనాలో తయారు చేస్తామని వివరించారు.
 
కాగా 2000 సంవత్సరంలో మార్కెట్లో విడుదలై ట్రెండ్ సృష్టించిన ఐకానిక్ మోడల్‌ అయిన నోకియాను స్వల్ప మార్పులతో నోకియా 3310 ఫోన్‌గా అందుబాటులోకి రానుంది. అయినా ఇది పాత లుక్‌ను పోలి ఉంటుంది. చాలా తేలికగా, స్లిమ్‌గా ఫీజికల్ కీబోర్డును కలిగివుంటుంది. కొత్త ఫోనులో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగులతో పాటు బూడిద, నలుపు, రంగులు కూడా అందుబాటులో ఉంటుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments