Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోకియా 3, నోకియా 5 స్మార్ట్‌ఫోన్లు రిలీజ్.. త్వరలో నోకియా 6 సైతం... ఫీచర్లపై ఓ లుక్కేస్తే..

మొబైల్ దిగ్గజం నోకియా తన కొత్త ఉత్పత్తులైన నోకియా 3, నోకియా 5లను ఆవిష్కరించింది. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017లో వీటిని ఆవిష్కరించింది. నోకియా బ్రాండ్ పార్ట్‌నర్ అయిన ‘హెచ్‌ఎమ్‌

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (18:29 IST)
మొబైల్ దిగ్గజం నోకియా తన కొత్త ఉత్పత్తులైన నోకియా 3, నోకియా 5లను ఆవిష్కరించింది. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017లో వీటిని ఆవిష్కరించింది. నోకియా బ్రాండ్ పార్ట్‌నర్ అయిన ‘హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్’ మార్కెట్‌లో విడుదల చేసిన ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ వెర్షన్‌తో తయారు చేశారు. ఈ రెండు ఫోన్లు 4జీ ఎల్‌టీఈ టెక్నాలజీకి పూర్తిగా సపోర్ట్ చేయనున్నాయి. అలాగే, ఇప్పటికే చైనాలో విడుదలైన ‘నోకియా 6’ను సైతం భారత విపణిలో తొందరలోనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలావుండగా, ఈ ఫోన్లు ధరలను రూ.9780, రూ.13000గా నిర్ణయించింది. ఈ ఫోన్లలో ఫీచర్లను పరిశీలిస్తే... 
 
నోకియా 3లో 5 అంగుళాల డిస్‌ప్లే, 1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యూయల్ సిమ్, వెనుక వైపు 8 మెగాపిక్సెల్ కెమెరా (ఎల్ఈడీ ఫ్లాష్), ముందు వైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. అలాగే, 2జీబీ రామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమోరి (మైక్రో ఎస్‌డి కార్టుతో 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు), 2650ఎమ్ఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ తదితర ఫీచర్లను అమర్చారు. 
 
అలాగే, నోకియా 5లో 5.2 అంగుళాల డిస్‌ప్లే, 1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, డ్యూయల్ సిమ్, వెనుక వైపు 13 మెగాపిక్సెల్ కెమెరా (ఎల్ఈడీ ఫ్లాష్), ముందు వైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ సామర్ధ్యం కలిగిన బ్యాటరీ, 2జీబీ రామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమోరి (మైక్రో ఎస్‌డి కార్టుతో 128 జీబీ వరకు పెంచుకోవచ్చు) తదితర అత్యాధునిక ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

తర్వాతి కథనం
Show comments