Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటా వార్‌కు తెరపడేలా లేదు.. జియో ప్లాన్స్ 12-18 నెలల కొనసాగింపు?

టెలికామ్ సంస్థల మధ్య డేటా వార్‌కు ఇప్పట్లో తెరపడేలా లేదు. దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. తన వ్యాపార ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భ

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (14:06 IST)
టెలికామ్ సంస్థల మధ్య డేటా వార్‌కు ఇప్పట్లో తెరపడేలా లేదు. దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. తన వ్యాపార ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏడాది నుంచి 18 నెలల వరకు ఫ్రీ ఆఫర్లు, డిస్కౌంట్ ఆఫర్లు కొనసాగించాలనే ఆలోచనలో ఉంది. 
 
వాస్తవానికి జియో దెబ్బకు ఐడియా, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్, ఎయిర్ టెల్ లాంటి దిగ్గజాలు కూడా అన్ లిమిటెడ్ ఆఫర్ల బాట పట్టాయి. ఇది ఎంతో ఆర్థిక భారంతో కూడుకున్న వ్యవహారమే అయినప్పటికీ.. జియో దెబ్బ నుంచి తప్పించుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. 
 
కానీ ఈ ఆఫర్లు ఎక్కువ కాలం కొనసాగవు. దీన్ని అనుకూలంగా మలుచుకున్న జియో.. మరో ఏడాది పాటు ఆఫర్లను కొనసాగించావని డిసైడ్ అయ్యింది. మరో సంవత్సర కాలం పాటు ఈ ఆఫర్లను ఏ ఇతర కంపెనీ భరించలేదు కాబట్టి... ఆ పని తాను చేస్తే, ప్రత్యర్థి కంపెనీలన్నీ మటాష్ అయిపోతాయని జియో భావిస్తోంది. ఇదే జరిగితే జియో కస్టమర్లు ఇక పండగ చేసుకుంటారు. 
 
ప్రైమ్ వినియోగదారులకు రిలయన్స్ జియో రీఛార్జ్ ఆఫర్స్.. 
ప్రస్తుతం రిలయన్స్ జియో ప్రైమ్ యూజర్లకు మంచి రీఛార్జ్ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా తమ వినియోగదారులకు జియో మూడు ఆఫర్లను ప్రకటించింది. రూ.149కి రీఛార్జ్ చేయడం ద్వారా 2జీబీ హై స్పీడ్ 4జీ డేటాను (28 రోజులు) అందజేస్తుంది. వీటితో పాటు ఫ్రీ వాయిస్ కాల్స్, జియో ఆప్స్, 300 ఎస్సెమ్మెస్‌లు అందజేస్తోంది. ఇదే విధంగా రూ.309, రూ.509, ఆఫర్లు కూడా జియో ప్రైమ్ యూజర్లకు ప్రకటించింది. రూ.309 ప్లాన్ ద్వారా 1 జీబీ హై-స్పీడ్ 4జీ డేటా 28 రోజులకు పొందవచ్చు. అలాగే రూ.509 ఆఫర్ ద్వారా 2జీబీ హై-స్పీడ్ 4జీ డేటాను కూడా రిలయన్స్ యూజర్లకు అందిస్తోంది. ప్రైమ్ వినియోగదారులు కానివారికి.. రూ.408 , రూ. 608 ఆఫర్లున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments