Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 రోజుల కాలపరిమితితో కొత్త ప్లాన్స్ ప్రకటించిన జియో - ఎయిర్‌టెల్

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (14:42 IST)
టెలికాం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) ఆదేశం మేరకు దేశంలోని టెలికాం సంస్థలు 30 రోజుల కాల వ్యవధితో కూడిన ప్లాన్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే వొడాఫోన్ ఐడియా ఈ తరహా ప్లాన్స్‌ను తన వినియోగదారులకు అందచేసింది. ఇపుడు ఇదే బాటలో జియో, ఎయిర్‌టెల్ సంస్థలు నడువనున్నాయి. ఇందుకోసం ఈ రెండు సంస్థలు కలిసి నాలుగు ప్లాన్స్‌ను ప్రవేశపెట్టాయి. 
 
రిలయన్స్ జియో రూ.256 ప్లాన్
నెలకు ఒకసారి ఈ ప్లాన్‌ను రీచార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఏప్రిల్ 6వ తేదీన రీచార్జ్ చేసుకున్నట్టయితే మే 5వ తేదీన ఈ ప్లాన్ రిచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ కింద రోజుకు 1.5 జీవీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమతి వాయిస్ కాల్స్ చేసుకునే వెసులుబాటు వుంది. 
 
జియో రూ.296 ప్లాన్
ఈ ప్యాక్‌లో రోజువారీగా 100 ఎస్ఎంఎస్‌లు, ఉచిత వాయిస్ కాల్స్‌ను వినియోగించుకోవచ్చు. అలాగే, రోజువారీగా 2 జీబీ డేటా ఇస్తుంది. 30 రోజుల కాలపరిమితి. 
 
ఎయిర్‌టెల్ రూ.319
ఈ ప్లాన్ కాలపరిమితి 30 రోజులు. ఇందులో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, రోజువారీగా 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. 
 
ఎయిర్‌టెల్ రూ.296
ఇది కూడా 30 రోజుల కాల వ్యవధితో పనిచేస్తుంది. ఇందులో 25 జీబీ డేటాతో పాటు ఉచిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments