Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై ఎఫ్ఐఆర్: తొలగించిన పోలీసులు

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (21:18 IST)
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై నమోదైన ఎఫ్ఐఆర్‌ను యూపీలోని వారణాసి పోలీసులు తొలగించారు. ప్రధాని మోదీని కించపరిచేట్టుగా ఉన్న ఓ వీడియో రూపకల్పనలో వీరి ప్రమేయం ఉందన్న ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు పెట్టారు. సుందర్ పిచాయ్‌తో పాటు గూగుల్‌కి చెందిన మరో ముగ్గురు ఉన్నతాధికారుల పేర్లు కూడా ఉన్నప్పటికీ.. చివరకు అసలు విషయం తెలిసి.. నాలుక్కరుచుకున్నారు. 
 
ఈ వీడియో మొదట వాట్సాప్ గ్రూప్‌లో, ఆ తరువాత యూ ట్యూబ్ లో సర్క్యులేట్ అయిందని, దానికి 5 లక్షల వ్యూస్ వచ్చాయని, వారణాసి లోని ఓ వ్యక్తి పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఆ వెంటనే తన మొబైల్ ఫోన్‌కు ఎనిమిదిన్నర వేల బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన పేర్కొన్నాడు. సుందర్ పిచాయ్ సహా సంజయ్ కుమార్ గుప్తా తదితరుల పేర్లు ఈ ఎఫ్‌ఐ‌ఆర్‌లో ఉన్నాయి.
 
దీనిపై గూగుల్ స్పందన ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వీడియో సాంగ్‌ను ఘాజీపూర్ లోని మ్యుజిషియన్లు రూపొందించారని, వారితో బాటు రికార్డింగ్ స్టూడియో, స్థానిక మ్యూజిక్ లేబెల్ కంపెనీ నిర్వాహకులకు కూడా ఈ కేసుతో ప్రమేయమున్నట్టు పోలీసులు పేర్కొన్నారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments