Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోటో జీ 5జీ.. ధర: రూ.20,999.. డిసెంబర్ 7నుంచి ఫ్లిఫ్ కార్ట్‌లో...

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (15:41 IST)
Moto G 5G
మోటోరోలా నుంచి మోటో జీ 5జీ పేరిట కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. అతి చౌక ధరలో బడ్జెట్ ధరకు ఈ ఫోన్ లభించనుంది. మోటోరోలా నుంచి విడుదలైన లేటెస్ట్ మిడ్ రేంజ్ 5జి స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం.

మోటో జి 5జి స్మార్ట్ ఫోన్ వల్కనిక్ గ్రే, ఫ్రాస్టెడ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా ఈ ఫోన్ ధర రూ.20,999గా ఉంది. దీన్ని డిసెంబర్ 7వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో ఈ ఫోన్ పై రూ.1000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.  
 
ఇందులో హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్ ఉంది. డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్‌ను కలిగి వున్న ఈ ఫోనుకు టర్బో పవర్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. వెనుక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు.  
 
ఈ ఫోన్‌లో 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగన్ 750జి 5జి ప్రాసెసర్‌ను అమర్చారు. 6జీబీ ర్యామ్ ఉంది. ఆండ్రాయిడ్ 10ఓఎస్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఫోన్‌కు వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, దానికి తోడుగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్ ఉంది. 
 
మోటో జి 5జి స్పెసిఫికేషన్స్‌…
* 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2400 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 750జి ప్రాసెసర్‌, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ 52 వాటర్ రెసిస్టెన్స్
* 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

తర్వాతి కథనం
Show comments