Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోటరోలా నుంచి 5జీ స్మార్ట్ ఫోన్.. యూరప్‌లో లాంఛ్

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (22:47 IST)
Moto G 5G
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన జీ సిరీస్‌లో సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. మోటో జి 5జి పేరుతో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్‌ను నవంబర్ 6న యూరప్‌లో విడుదల చేసింది. మోటో జీ 5జీ స్మార్ట్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 750జి ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. కాగా, ధర విషయానికి వస్తే మోటో జి 5జి స్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ఈయూఆర్ 299.99 (భారత కరెన్సీలో సుమారు రూ .26,200) ధరతో లాంచ్ చేయబడింది. 
 
కాగా, ప్రస్తుతం ఎంపిక చేసిన యూరోపియన్ దేశాల్లో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండనుందని, త్వరలోనే ఆయా దేశాల్లో అమ్మకాలు ప్రారంభిస్తామని మోటరోలా ప్రకటించింది. రాబోయే కొద్ది వారాల్లోనే భారతదేశం, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాలల్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
 
స్పెసిఫికేషన్లు..
మోటో జి 5 జి వోల్కానిక్ గ్రే, ఫ్రాస్టడ్ సిల్వర్ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. మోటో జి 5 జి స్మార్ట్ఫోన్ 397 పిపి పిక్సెల్ సాంద్రతతో కూడిన 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. కాగా, ప్రస్తుతం ఇది 4జీబీ రామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులోకి రానుంది. కాకపోతే, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు మైక్రో ఎస్డీ కార్డ్ ఉపయోగించి స్టోరేజ్ ను ఒన్‌టీబీ వరకు విస్తరించవచ్చు.
 
48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ వైడ్ యాంగిల్ షూటర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాల వంటి కెమెరాలను చేర్చింది. అంతేకాక, సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments