Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యకు 3సార్లు గర్భస్రావం అయ్యింది.. ఐతే రెండో బిడ్డకు తండ్రి కాబోతున్నా: జుకర్ బర్గ్

ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఇప్పటికే జుకర్ బర్గ్‌కు మ్యాక్స్ అనే కూతురుంది. తాజాగా.. తమకు మరో కుమార్తె పుట్టబోతోందని జుకర్ బర్గ్ వెల్లడించారు. తాజాగా మరో కుమార్తె

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (10:55 IST)
ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఇప్పటికే జుకర్ బర్గ్‌కు మ్యాక్స్ అనే కూతురుంది. తాజాగా.. తమకు మరో కుమార్తె పుట్టబోతోందని జుకర్ బర్గ్ వెల్లడించారు. తాజాగా మరో కుమార్తె పుట్టనుందని.. ఎంతో హ్యాపీగా ఉందని జుకర్ బర్గ్ హర్షం వ్యక్తం చేశారు. మరో శక్తిమంతమైన మహిళగా ఆమెను పెంచేందుకు శాయశక్తులా తాను, ప్రిస్కిల్లా ప్రయత్నిస్తామని తెలిపారు. 
 
తన భార్య ప్రిస్కిల్లాకు తొలుత మూడుసార్లు గర్భస్రావం అయ్యిందని.. ఆ తర్వాత మ్యాక్స్ జన్మించిందని, ఇప్పుడు మరో బిడ్డ పుట్టబోతోందని హర్షం వ్యక్తం చేశారు. గర్భస్రావం జరగడంతో తమకు సంతానం కలగదని భావించామని చెప్పారు. తనకు పుట్టబోయే రెండో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
 
ఇదిలా ఉంటే, రెండో కుమార్తె పుట్టే అదృష్టమో ఏమో కానీ జుకర్ బర్గ్‌ డిగ్రీ అందుకోనున్నాడు. విద్యాభ్యాసాన్ని మధ్యలోనే వదిలేసిన జుకర్ బర్గ్.. మళ్లీ విద్యపై దృష్టి సారించారు. ఈ ప్రయత్నం సఫలమైంది. హార్వర్డ్‌  నుంచి డిగ్రీ పట్టా అందుకోబోతున్నాడు. మే నెలలో హార్వర్డ్‌  యూనివర్శిటీ గ్రాడ్యుయేషన్‌ డే జరగనుంది. ఈ కార్యక్రమంలో జుకర్ బర్గ్ ప్రారంభోపన్యాసం చేస్తారు. 
 
అయితే గ్రాడ్యుయేషన్‌ డేలో ఏం మాట్లాడాలో సలహా ఇవ్వాలంటూ జుకర్‌.. మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌‌ను కోరారు. వీరిద్దరూ మాట్లాడుకున్న వీడియోను జుకర్‌  తన ఫేస్‌ బుక్‌  ఖాతాలో పోస్టు చేశారు. గౌరవ డిగ్రీతో నీ కల నెరవేరుతుందని ఆశిస్తున్నా అని జుకర్‌కు గేట్స్‌ అభినందనలు తెలియజేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments