Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైకులు ఇవ్వండి.. లోన్ తీసుకోండి.. సలామ్ లోన్స్ గురించి మీకు తెలుసా?

సోషల్ మీడియా పుణ్యంతో లైక్ అనే పదానికి అర్థం అందరికీ తెలిసిపోయింది. లైక్ అనే పదం ఫేస్ బుక్, ట్విట్టర్ ఉపయోగించే వారికి బాగా తెలుసు. లైక్ అనే మాట మన అవసరాలు తీర్చేందుకు ఉపయోగపడుతుందంటే నమ్ముతారా? నమ్మి

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (14:32 IST)
సోషల్ మీడియా పుణ్యంతో లైక్ అనే పదానికి అర్థం అందరికీ తెలిసిపోయింది. లైక్ అనే పదం ఫేస్ బుక్, ట్విట్టర్ ఉపయోగించే వారికి బాగా తెలుసు. లైక్ అనే మాట మన అవసరాలు తీర్చేందుకు ఉపయోగపడుతుందంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. మనకు బాగా లైక్స్ వస్తే.. లోన్ ఇచ్చేందుకు టాటా క్యాపిటల్‌ అందుబాటులోకి వస్తోంది. ఎవరైనా తమ పోస్టు ద్వారా తమకు ఆర్థిక అవసరం గురించి తెలియజేస్తూ చేసిన పోస్టుకు.. నెటిజన్లను లైకులు ఇవ్వాలి. అలా వచ్చిన లైకులను బట్టి అప్పు తీసుకోవచ్చు. 
 
ఇలాంటి వినూత్న ఆలోచనతోనే టాటా క్యాపిటల్‌ సలామ్‌ లోన్స్‌ పేరుతో రుణాలను మంజూరు చేస్తోంది. రకరకాల కారణాలతో వ్యక్తిగత రుణాలు దొరకని వారికి ఈ విధానం ద్వారా లోన్ పొందవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన వారు, తక్కువ ఆదాయం ఉన్నవారు, వార్షికాదాయం రూ.3లక్షలకు మించని వారు ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
రుణం కావాలనుకునే వారు తమకెందుకు అప్పు అవసరం ఉందో తెలియజేస్తూ ఒక చిన్న వివరణను సమర్పించాలి. ఆపై పోస్టుని టాటా క్యాపిటల్‌ ఫేస్‌బుక్‌ పేజీ, ట్విట్టర్‌, యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేస్తారు. వీటిలో వచ్చే లైకులను.. సలామ్‌ల ఆధారంగా టాటా క్యాపిటల్ రుణాన్ని మంజూరు చేస్తుంది. ఈ రుణం రూ.25,000 నుంచి రూ.1,00,000 వరకూ రుణం ఇస్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

Balagam Actor: బలగం నటుడు మొగిలయ్య కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments