Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో నుంచి కొత్త ప్లాన్.. జియో ఫైబర్ పేరిట.. 100Mbpsతో 100జీబీ ఉచిత డేటా

ఉచిత డేటాతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో నెట్‌వర్క్ ప్రస్తుతం జియో ఫైబర్ సేవలను కస్టమర్లకు అందించేందుకు రెడీ అవుతోంది. ఈ సేవల ద్వారా ఉచిత ఆఫర్‌లను వినియోగదారులకు అందించనుంది. జియో ఫైబర్ ప్రివ్యూ ప్

Webdunia
బుధవారం, 12 జులై 2017 (14:25 IST)
ఉచిత డేటాతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో నెట్‌వర్క్ ప్రస్తుతం జియో ఫైబర్ సేవలను కస్టమర్లకు అందించేందుకు రెడీ అవుతోంది. ఈ సేవల ద్వారా ఉచిత ఆఫర్‌లను వినియోగదారులకు అందించనుంది. జియో ఫైబర్ ప్రివ్యూ ప్లాన్ ప్రకారం కస్టమర్లకు సెకనుకు 100 ఎంబీపీఎస్ వేగంతో 100 జీబీ డేటాను అందించనుంది. ఈ డేటాను మూడు నెలల పాటు ఉచితంగా అందించనున్నట్లు జియో ప్రకటించింది.
 
అయితే ఈ ఆఫర్ పొందాలంటే.. వినియోగదారులు ఇన్‌స్టాలేషన్ పేరిట రూ.4,500 చెల్లించాల్సి వుంటుంది. అయితే ఈ నగదు రీఫండబుల్. ఇంకా సెక్యూరిటీ డిపాజిట్‌గా వుంటుందని జియో ప్రకటించింది. ప్రతినెలా 100 జీబీ డేటా పూర్తైతే మాత్రం ఇంటర్నెట్ వేగం తగ్గిపోతుందని సంస్థ తెలిపింది. ప్రివ్యూ ప్లాన్ ముగిశాక ఉచిత ఆఫర్లను జియో ప్రకటిస్తుందని సమాచారం.
 
ఈ ప్లాన్ లో భాగంగా రూటర్ ను కూడా కంపెనీ సమకూరుస్తుంది. తొలుత ఈ సేవలను హైదరాబాద్, విశాఖపట్నం, ముంబై, ఢిల్లీ, కోల్ కతా, అహ్మదాబాద్, జైపూర్, సూరత్, వదోదర పట్టణాల్లో ప్రారంభించనున్నట్టు సమాచారం. హోమ్ బ్రాండ్ బ్యాండ్ కింద ఈ ప్లాన్‌ను జియో అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
 
ఇదిలా ఉంటే.. ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌ ప్రయోజనాలు, సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌ మరికొన్ని రోజుల్లో ముగుస్తుండగా.. రిలయన్స్‌ జియో తన ప్లాన్లను సవరించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రెండు సరికొత్త ప్లాన్లను కూడా జియో ప్రకటించింది. రూ.399, రూ.349 ఎంఆర్పీలతో ఈ కొత్త జియో ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్‌లో భాగంగా రూ.349 రీఛార్జ్‌తో 20జీబీ 4జీ డేటాను 56 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. అయితే డైలీ ఇంత డేటానే వాడుకోవాలనే పరిమితి వుండదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments