జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌పై 30రోజుల వ్యాలిడిటీ

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (10:20 IST)
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో ఇంటర్నెట్ కనెక్షన్లకు సంబంధించి కొత్త ప్లాన్‌లను వినియోగదారుల కోసం ప్రవేశపెట్టింది. తాజాగా జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌పై అదనంగా 30 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. లాంగ్ టర్మ్ ప్లాన్స్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. లాంగ్ టర్మ్ ప్లాన్ తీసుకున్నవారు అదనంగా నెల రోజుల వేలిడిటీ పొందొచ్చు. రిలయెన్స్ జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ వేర్వేరుగా ఉన్నాయి. 
 
మంత్లీ, క్వార్టర్లీ, సెమీ-యాన్యువల్, యాన్యువల్ ప్లాన్స్‌ని అందిస్తోంది జియోఫైబర్. వీటిలో యాన్యువల్ ప్లాన్స్ తీసుకుంటే 30 రోజుల వేలిడిటీ అదనంగా పొందొచ్చు. అంటే 12 నెలలకు ప్లాన్ తీసుకుంటే అదనంగా మరో నెలరోజుల వేలిడిటీ వస్తుంది. అంటే 12 నెలలకు డబ్బులు చెల్లించి 13 నెలలపాటు జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఉపయోగించుకోవచ్చు
 
ఇందులో భాగంగా జియోఫైబర్ రూ.4,788 యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 360 రోజుల వేలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా మరో 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 30ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.
 
జియోఫైబర్ రూ.8,388 యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 360 రోజుల వేలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా మరో 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.
 
జియోఫైబర్ రూ.11,988 యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 360 రోజుల వేలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా మరో 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 150ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.
 
జియో యాప్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ నెక్స్‌ట్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఆల్ట్ బాలాజీ, హోయ్‌చోయ్, షెమారూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఎరోస్ నౌ, జియోసినిమా, జియోసావన్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితం. ఇలా ప్రతి ప్లాన్‌పై అదనపు వాలిడిటీ లభిస్తుందని జియో ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments