Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియోకు షాక్.. టెలినార్ స్పెషల్ ప్లాన్.. 80 పైసలకే 1 జీబీ డేటా

రిలయన్స్ జియోకు ప్రత్యర్థి విసిరిన పంజా దెబ్బతో ఇబ్బందులు తప్పేలాలేవు. నార్వేకు చెందిన టెలికాం కంపెనీ టెలినార్ మంగళవారం ఓ స్పెషల్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ కింద కేవలం రూ.47కు 56జీబీ 4జీ డేటాను అంద

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (10:07 IST)
రిలయన్స్ జియోకు ప్రత్యర్థి విసిరిన పంజా దెబ్బతో ఇబ్బందులు తప్పేలాలేవు. నార్వేకు చెందిన టెలికాం కంపెనీ టెలినార్ మంగళవారం ఓ స్పెషల్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ కింద కేవలం రూ.47కు 56జీబీ 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. ఈ డేటా 28 రోజుల వరకు వాలిడిటీ ఉంటుందట. అయితే ఎవరైతే రోజుకు గరిష్టంగా 2జీబీ డేటాను వాడుతారో ఆ సబ్ స్క్రైబర్లకు మాత్రమే ఈ ప్లాన్‌ను సద్వినియోగం చేసుకోవడానికి వీలవుతుందని కంపెనీ ప్రకటించింది.
 
ఈ కొత్త ప్లాన్ కింద 80 పైసలకే 1జీబీ డేటాను అందిస్తామని.. కానీ కండిషన్లు అప్లయ్ అవుతాయని టెలినార్ వెల్లడించింది. టెలినార్ ప్రకటించిన ఈ ఆఫర్, రిలయన్స్ జియో కొత్తగా అమలుచేయబోతున్న రూ.303 ప్లాన్‌ను పోలి ఉందని తెలుస్తోంది. జియోను టార్గెట్‌గా చేసుకుని టెలినార్ ఈ ఆఫర్‌ను ప్రకటించిందట. అయితే ఈ ప్లాన్ కింద జియో మాదిరి ఉచిత వాయిస్ కాల్స్ ను టెలినార్ అందించడం లేదు.   
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments