Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ : రూ.1,495కే 3 నెలలు అన్‌లిమిటెడ్‌ డేటా

రిలయన్స్‌ జియో నుంచి పోటీ పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించే సరికొత్త పథకాలు తీసుకురావడంపై ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌తో సహా ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా దృష్టిసారిస్తున్నాయి.

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (17:07 IST)
రిలయన్స్‌ జియో నుంచి పోటీ పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించే సరికొత్త పథకాలు తీసుకురావడంపై ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌తో సహా ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా దృష్టిసారిస్తున్నాయి. ఇందులోభాగంగా భారత్ ఎయిర్‌టెల్‌ 1,495 రూపాయలకే 3 నెలలపాటు అన్‌లిమిటెడ్‌ డేటాను అందించే 4జి ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను ప్రకటించింది. 
 
ప్రస్తుత వినియోగదారులు 1,495 రూపాయలకు ఈ ప్యాక్‌‌ను పొందవచ్చు. ఇందులో 30 జిబి వరకు 4జి వేగం ఉంటుందని కంపెనీ చెబుతోంది. కొత్త కస్టమర్లు అయితే రూ.1,494 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ప్యాక్‌తో ఎయిర్‌టెల్‌ కూడా ఒక జిబి డేటాను 50 రూపాయలకే ఆఫర్‌ చేసినట్టవుతుంది. 
 
ఈ ప్యాక్‌ కింద 30 జిబిల వరకు 90 రోజులపాటు అధిక వేగంతో డేటాను పొందవచ్చని, డేటా పరిమితి దాటిన తర్వాత ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉంటాయని, అప్పుడు 2జి వేగమే ఉంటుందని కంపెనీ ఆపరేషన్స్‌ (ఇండియా, దక్షిణాసియా) డైరెక్టర్‌ అజయ్‌ పూరి తెలిపారు. 4జీ కస్టమర్లను దృష్టిలో ఉంచుకునే ఈ ప్యాక్‌ను ప్రవేశపెట్టినట్టు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments