Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో దెబ్బకు దిగివస్తున్న టెలికాం కంపెనీలు.. ఎయిర్ టెల్ తాజా ఆఫర్ ఇదే...

రిలయన్స్ జియో దెబ్బకు అన్ని టెలికాం కంపెనీలు దిగివస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు ధరల తగ్గింపులో ఏమాత్రం పట్టువీడని కంపెనీలు.. తాజాగా ఎయిర్‌ టెల్ కంపెనీ సరికొత్త ఆఫర్‌ను వెల్లడించనుంది. అనుకున్నట్టుగా ఆ

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (16:13 IST)
రిలయన్స్ జియో దెబ్బకు అన్ని టెలికాం కంపెనీలు దిగివస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు ధరల తగ్గింపులో ఏమాత్రం పట్టువీడని కంపెనీలు.. తాజాగా ఎయిర్‌ టెల్ కంపెనీ సరికొత్త ఆఫర్‌ను వెల్లడించనుంది. అనుకున్నట్టుగా ఆ కంపెనీ ఈ తాజా ఆఫర్‌ను ప్రకటించినట్టయితే ఎయిర్ టెల్ వినియోగదారులకు పండగే. 
 
ఇదే అంశంపై ఆ కంపెనీ సీనియర్ ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ.. ‘‘దేశ వ్యాప్తంగా ఎయిర్‌టెల్ వినియోగదారులకు కంపెనీ ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌లపై ఉచిత రోమింగ్ సేవలు అందించనుంది. ఔట్ గోయింగ్ చార్జీలపై కూడా ఎలాంటి అదనపు చార్జీలు ఉండబోవు’’ అని అన్నారు. డేటా సేవల్లోనూ నేషనల్ రోమింగ్‌పై ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని పేర్కొన్నారు.
 
దీంతోపాటు యాక్టివేషన్‌ను మరింత సరళతరం చేయనున్నారనీ.. విదేశాలకు వెళ్లే వినియోగదారులకు సైతం ధరలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌లను ఉపయోగించుకునేలా ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. కాగా ఈ వార్తలపై భారత అతిపెద్ద టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడాల్సి వుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments