Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో కామెంట్స్.. ల్యాండ్‌లైన్ నెంబర్లను మొబైల్ నెంబర్లుగా చూపిస్తారా?

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (11:44 IST)
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. ఇతర టెలికాం సంస్థలకు గట్టి పోటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో టెలికాం రంగ సంస్థలన్నీ పోటీ పడినా జియోతో ఢీ కొట్టలేకపోతున్నాయి. వినియోగదారులకు ఇతర టెలికాం సంస్థలు మంచి మంచి ఆఫర్లు ఇచ్చినా.. జియోకు కస్టమర్ల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. 
 
ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్‌ వంటి సంస్థలు జియోతో యుద్ధానికి కాలుదువ్వుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌లపై రిలయన్స్‌ జియో సంచలన ఆరోపణలు చేసింది. ఇంటర్‌కనెక్ట్‌ రాబడిని అక్రమంగా ఆర్జించేందుకు ఈ సంస్థలు ల్యాండ్‌లైన్‌ నెంబర్లను మొబైల్‌ నెంబర్లుగా చూపాయని రిలయన్స్‌ జియో ఆరోపించింది. 
 
ఈ సంస్థలపై ట్రాయ్ భారీ జరిమానా విధించాలని కోరింది. అంతేగాకుండా టెలికాం నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడిన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌పై భారీ జరిమానా విధించాలని ట్రాయ్‌ చీఫ్‌ ఆర్‌ఎస్‌ శర్మకు ఈనెల 14న రాసిన లేఖలో జియో విజ్ఞప్తి చేసింది.
 
ఈ మూడు టెలికాం ఆపరేటర్లు పాల్పడిన మోసానికి రూ వందల కోట్లు జియోకు, ప్రభుత్వానికి ఆదాయ నష్టం వాటిలిల్లిందని పేర్కొంది.
 
ఈ స్కామ్‌ వెలుగుచూసిన క్రమంలో ఆయా కంపెనీలకు తాము చెల్లించిన టెర్మినేషన్‌ ఛార్జీలను రిఫండ్‌ చేసేలా చర్యలు చేపట్టాలని ట్రాయ్‌ను కోరింది. కాగా జియో ఆరోపణలను ఎయిర్‌టెల్‌ తోసిపుచ్చింది. ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జ్‌పై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో ట్రాయ్‌ను తప్పుదారిపట్టించేందుకు జియో ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments