Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాన్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలా? ఆ వివరాలు తప్పైతే?

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (17:04 IST)
పాన్ కార్డును కలిగివున్నారా? అయితే వెంటనే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. ఆధార్, పాన్ కార్డులను అనుసంధానం చేసుకోకపోతే.. రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవు. కాబట్టి వెంటనే పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడం మంచిది. పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి వచ్చే ఏడాది మార్చి నెల చివరి వరకు గడువు ఉందనే విషయాన్ని గుర్తించుకోవాలి. 
 
ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌కు వెళ్లి ఈ రెండింటిని సులభంగా లింక్ చేసుకోవచ్చు. కానీ పాన్ కార్డు లేదా ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉంటే రెండింటినీ లింక్ చేసుకోవడం కుదరదు. అప్పుడేం చేయాలంటే..? మీరు పాన్ కార్డ్ లేదా ఆధార్‌లో వివరాలను సరిచేసుకోవాలి. పాన్ కార్డులో తప్పులు సరిచేసుకోవాలంటే ఉమాంగ్ యాప్ ద్వారా ఈ పని పూర్తి చేయొచ్చు. ఉమాంగ్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయిన తర్వాత సెర్చ్ బార్‌లో పాన్ కార్డు అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఇప్పుడు మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో పాన్ కార్డు కరెక్షన్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత మీ వివరాలను మార్చుకోవాలి. ఆపై ఆధార్‌తో పాన్ కార్డును అనుసంధానం చేసుకోవడం సులభం అవుతుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments