Webdunia - Bharat's app for daily news and videos

Install App

సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా మారనున్న ఫ్లిఫ్ కార్ట్ సీఈవో.. ఐఫోన్ 7దే అగ్రస్థానం..

రిలయన్స్ జియో ప్రభావంతో 4జీ మొబైళ్ల అమ్మకం జోరందుకుంది. 4జీ సేవలను మూడు మాసాలు జియో ఉచితంగా ప్రకటించడంతో వినియోగదారులు 4జీ మొబైళ్లను పోటాపోటీగా కొనేస్తున్నారు. ఈ మొబైళ్ల కొనుగోలు అత్యధిక శాతం ఆన్‌లైన్

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (16:37 IST)
రిలయన్స్ జియో ప్రభావంతో 4జీ మొబైళ్ల అమ్మకం జోరందుకుంది. 4జీ సేవలను మూడు మాసాలు జియో ఉచితంగా ప్రకటించడంతో వినియోగదారులు 4జీ మొబైళ్లను పోటాపోటీగా కొనేస్తున్నారు. ఈ మొబైళ్ల కొనుగోలు అత్యధిక శాతం ఆన్‌లైన్‌లో జరుగుతోంది. దీంతో భారత్‌లోని ఈ-కామర్స్ దిగ్గజాల్లో పోటీ పెరిగిపోతోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. 
 
ఇలా ఈ-కామర్స్ మొబైళ్ల విక్రయంలో ఫ్లిప్ కార్ట్ ముందుంది. ఈ పండుగ సీజన్‌లో ఫ్లిఫ్ కార్ట్ అమ్మకాల్లో ఐఫోన్ 7 మోడలే అగ్రస్థానంలో నిలిచింది. యాపిల్ ఐఫోన్ 7 అమ్మకాలను పెంచుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ సీఈవో బిన్నీ బన్సాల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా మారబోతున్నారు. 
 
శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఫ్లిప్‌కార్ట్ సీఈవో డోర్ డెలివరీ ద్వారా సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లా వెళ్లి ఫస్ట్ ఆర్డర్ చేసిన వ్యక్తికి ఐఫోన్ 7ను అందించనున్నారు. అంతేకాదు, ఈ ఫోన్ కొన్నవారికి ఫ్లిప్‌కార్ట్ సర్‌ప్రైజ్ కూడా ఇవ్వనుందట. అమ్మకాలు పెంచుకోవడానికి, వినియోగదారులను ఆకర్షించడానికి ఫ్లిప్‌కార్ట్ ఈ డోర్ డెలివరీ స్ట్రాటజీని అమలు చేస్తోందని ఐటీ నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments