Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఇన్ఫోసిస్ భారీ పెట్టుబడి.. ఏపీఐఐసీ నుంచి 447 ఎకరాలు

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (13:01 IST)
కరోనా దెబ్బకు దాదాపు అన్ని రంగాలు కుదేలైనా.. ఐటీ రంగంపై మాత్రం ఆ ఎఫెక్ట్ అంతగా పడలేదు. వర్క్ ఫ్రం హోం ద్వారా ప్రొడక్టివిటీ ఏ మాత్రం తగ్గలేదని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా తెలంగాణలో భారీగా పెట్టుబడులకు సిద్ధమైంది. 
 
రాష్ట్రంలో రూ. 2500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నిధులతో హైదరాబాద్‌లోని పోచారం క్యాంపస్‌ను విస్తరించనుంది ఇన్ఫోసిస్. దీంతో దాదాపు 20 వేల మందికి నూతనంగా ఉద్యోగవకాశాలు రానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
 
ఈ నిధులతో సాఫ్ట్ వేర్ డవలప్మెంట్ బ్లాక్‌లు, ఫుడ్ కోర్టులు, ఆడిటోరియం, ఇతర సదుపాయల కోసం బిల్డింగ్, మల్టిలెవల్ కార్ పార్కింగ్‌ను 329.84 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008వ సంవత్సరంలో ఏపీఐఐసీ నుంచి 447 ఎకరాలను తీసుకుంది. ఘటకేసర్ మండలంలోని పోచారం క్యాంపస్ 117.24 ఎకరాల్లో ఇప్పటికే విస్తరించి ఉంది. ఈ తాజా విస్తరణ ద్వారా మరో నాలుగు ఐటీ డవలప్మెంట్ బ్లాకులను కంపెనీ నిర్మించనుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments