Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింగారీకి క్రేజ్.. ఏకంగా పది మిలియన్ డౌన్‌లోడ్లు

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (18:44 IST)
చైనీస్ యాప్స్ నిషేధం తర్వాత దేశీయ యాప్‌లపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. టిక్ టాక్ బ్యాన్ కావడంతో చింగారీ యాప్ డౌన్‌లోడ్లలో ప్రకంపనలు సృష్టిస్తోంది. చైనీస్ యాప్స్ నిషేధం తర్వాత ఇది మరింత దూకుడు ప్రదర్శిస్తోంది.
 
చైనా యాప్‌ల నిషేధానికి ముందే చింగారీ యాప్‌ను లాంచ్ చేసినా, నిషేధం తర్వాత ఇది ఒక్కసారిగా పాప్యులర్ అయింది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో ఏకంగా పది మిలియన్ డౌన్‌లోడ్ల మార్కును దాటేసింది. చింగారీ యాప్‌లో వీడియోలు ఎలా పనిచేస్తున్నదీ ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు సుమిత్ ఘోష్ గణంకాలతో సహా వివరించారు.
 
ఇందులో ఇప్పటి వరకు 148 మిలియన్ వీడియోలను వీక్షించగా, 3.6 మిలియన్ వీడియోలను లైక్ చేశారు. ఒకానొక దశలో గంటలకు లక్ష డౌన్‌లోడ్లు అయినట్టు సుమిత్ తెలిపారు. అలాగే, 72 గంటల్లో 5 లక్షల డౌన్‌లోడ్లు సొంతం చేసుకుంది. అలాగే, 11 మిలియన్ యూజర్లను సొంతం చేసుకుంది. ఈ నెలలో 100 మిలియన్ యూజర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సుమిత్ ఘోష్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments