Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేక్ ఫోన్ కాల్స్‌కు చెక్... Truecaller యాప్

స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారులు ఎవ్వరూ Truecaller యాప్ గురించి తెలియకుండా ఉండరు. ఈ రోజుల్లో మొబైల్‌ డిస్‌ప్లేపై గుర్తు తెలియని నంబర్‌ కనిపించిందంటే వినియోగదారులు ట్రూకాలర్‌ యాప్‌ను ఆశ్రయించడం ఎంతగానో పెరిగింది. భారత్‌లో Truecaller యాప్ చ

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (15:04 IST)
స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారులు ఎవ్వరూ Truecaller యాప్ గురించి తెలియకుండా ఉండరు. ఈ రోజుల్లో మొబైల్‌ డిస్‌ప్లేపై గుర్తు తెలియని నంబర్‌ కనిపించిందంటే వినియోగదారులు ట్రూకాలర్‌ యాప్‌ను ఆశ్రయించడం ఎంతగానో పెరిగింది. భారత్‌లో Truecaller యాప్ చాలా వేగంగా దూసుకుపోతోంది. ఈ కమ్యూనికేషన్‌ యాప్‌కు ఇటీవల భారత్‌లో విశేష ఆదరణ లభిస్తోంది. ఎంతలా అంటే గూగుల్‌ ప్లేస్టోర్‌లో అత్యధిక డౌన్‌లోడ్‌లు చేసుకుంటోన్న నాలుగవ అతిపెద్దగా యాప్‌గా ట్రు‌కాలర్ నిలిచింది.
 
స్వీడెన్‌కు చెందిన ఓ ప్రముఖ కంపెనీ ఈ యాప్‌ను తయారుచేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారులు ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్, గతంలో గుర్తించబడిన లక్షల మొబైల్ నెంబర్లకు సంబంధించిన డేటాబేస్‌ను కలిగి ఉంది. కాబట్టి, ఈ యాప్ ద్వారా కొత్త మొబైల్ నెంబర్లతో వచ్చే ఫోన్ కాల్స్‌ను దాదాపుగా ట్రేస్ చేయవచ్చు. మొబైల్ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకునేందుకు True Caller యాప్ ఉపయోగపడుతుంది. గుర్తు తెలియని నెంబర్‌ల నుంచి వచ్చే మొబైల్ కాల్స్‌ను ట్రేస్ చేయటంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ యాప్ ద్వారా గుర్తు తెలియని కాంటాక్ట్ నెంబర్‌కు సంబంధించి అడ్రస్‌తో సహా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
 
మ్యారీ మీకర్ ఇంటర్నెట్ ట్రెండ్స్ 2017 రిపోర్ట్స్ ప్రకారం గూగుల్ ప్లే స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న యాప్స్ జాబితాలో మొదటి ప్లేస్‌ను వాట్సాప్ కైవసం చేసుకోగా, రెండవ స్థానంలో మెసెంజర్ మూడవ స్థానంలో షేరిట్ యాప్స్ నిలిచాయి. ఫేస్‌బుక్ యాప్‌ను కూడా ట్రు‌కాలర్ బీట్ చేయటం విశేషం. అలాగే, యాప్‌లో ప్రకటనదారులకు రోజుకు లక్ష క్లిక్‌లను ట్రూకాలర్‌ అందిస్తుందని మేరీ మీకర్‌ ఇంటర్‌నెట్‌ ట్రెండ్స్‌ వెల్లడించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

తర్వాతి కథనం
Show comments