Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెటిజన్లకు శుభవార్త... కనీస ఇంటర్నెట్ వేగాన్ని నాలుగు రెట్లు పెంపుదల

ఇంటర్నెట్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కనీస ఇంటర్నెట్ వేగాన్ని నాలుగు రెట్లకు పెంచింది. అంటే ప్రస్తుతం కనీస ఇంటర్నెట్ వేగం సెకనుకు 512 కిలోబైట్లుగా ఉంది. దీన్ని 2 మెగాబైట్లకు పెంచనున్

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (14:29 IST)
ఇంటర్నెట్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కనీస ఇంటర్నెట్ వేగాన్ని నాలుగు రెట్లకు పెంచింది. అంటే ప్రస్తుతం కనీస ఇంటర్నెట్ వేగం సెకనుకు 512 కిలోబైట్లుగా ఉంది. దీన్ని 2 మెగాబైట్లకు పెంచనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను త్వరలోనే జారీ చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ వెల్లడించారు. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. దీన్ని మరింత ప్రోత్సహించేలా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అంటే ఇకపై కనీస ఇంటర్నెట్ వేగం సెకనుకు 2 మెగాబైట్లుగా ఉండనుందని టెలికం శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్ వెల్లడించారు. ఇంటర్నెట్ వేగం చాలా తక్కువగా ఉంటోందని గ్రామీణ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని ఆయన అన్నారు.
 
3జీ, 4జీ తరాలు పోయి 5జీ తరం రానుందని, ఈ నేపథ్యంలో కనీస వేగం మరింతగా పెరగాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మౌలిక వసతుల కొరత దృష్ట్యా 2 ఎంబీపీఎస్ వరకూ మాత్రమే వేగం పెంచలగమని భావిస్తున్నట్టు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ డిజిటల్ ఎకానమీగా మారుతోందని, దీనికి వేగవంతమైన ఇంటర్నెట్ తప్పనిసరిని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments