Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్: పూణేలో 150 గూగుల్ స్టేషన్లు

సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఈ మధ్య స్మార్ట్ ఫోన్ల వ్యాపారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా పూణే స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ కోసం తొలిసారిగా గురువారం లార్సెన్ అండ్ టర్బోత

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (16:20 IST)
సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఈ మధ్య స్మార్ట్ ఫోన్ల వ్యాపారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా పూణే స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ కోసం తొలిసారిగా గురువారం లార్సెన్ అండ్ టర్బోతో కలిసి పూణేలో 150 గూగుల్ హాట్ స్పాట్లను ఏర్పాటు చేసింది.

ఇదే తరహాలో దేశ వ్యాప్తంగా లార్సెన్ అండ్ టర్బోతో చేతులు కలిపి గూగుల్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ అధికారులు తెలిపారు. ఈ గూగుల్ స్టేషన్ల ద్వారా నాణ్యమైన వై-ఫై సేవలను అందించే వీలుంటుందని వారు చెప్పారు. 
 
ఇదిలా ఉంటే.. హ్యాకర్లు ఆండ్రాయిడ్ ఫోన్లకు నూతన తరహా మాల్‌వేర్, ట్రోజన్ వైరస్‌లను వ్యాప్తి చేస్తున్నారు. ఈ వైరస్‌లు ఎక్కువగా యాప్స్ నుంచే వస్తున్నట్లు గుర్తించారు. దీంతో సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ గత ఏడాది కాలంలో ఇలాంటి వైరస్‌‍లను వ్యాప్తి చెందించే యాప్‌లను ప్లే స్టోర్ నుంచి భారీగా తొలగించింది. 
 
2017వ సంవత్సరంలో మొత్తం ఏడు లక్షల ప్రమాదకరమైన యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు గూగుల్ తాజాగా వెల్లడించింది. అయితే 2016లో ప్లే స్టోర్ నుంచి తొలగింపబడిన యాప్స్‌తో పోలిస్తే 2017లో ఈ యాప్స్ సంఖ్య 70 శాతం ఎక్కువగా ఉందని ఐటీ నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments