హార్డ్‌వేర్ ఇంజనీర్లను చుక్కలు చూపుతున్న గూగుల్..

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (17:40 IST)
గూగుల్ సంస్థలో పనిచేసే హార్డ్‌వేర్ ఇంజనీర్‌లకు గడ్డుకాలమేనట. ఈ విషయాన్ని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ పత్రిక వెల్లడించింది. గూగుల్ సంస్థ తన ల్యాప్‌టాప్, టాబ్లెట్ విభాగాల్లో పనిచేసే హార్డ్‌వేర్ ఇంజనీర్‌లను ఇతర విభాగాల్లోకి మార్చేయనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థే వారికి కూడా వెల్లడించింది. దీని వలన గూగుల్ హార్డ్‌వేర్ వ్యాపారంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. 
 
గూగుల్ సంస్థ క్రియేట్ బృందాన్ని తగ్గించుకోవడం కోసం చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ బృందం పిక్సెల్ బుక్ ల్యాప్‌టాప్, పిక్సెల్ స్లేట్ టాబ్లెట్, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తోంది. 
 
ఈ బృందంతో పాటుగా మిగిలిన హార్డ్‌వేర్ బృందాలు సైతం పిక్సల్‌ స్మార్ట్‌ఫోన్లను, హోమ్‌ స్మార్ట్‌ స్పీకర్లను తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం వ్యాపారంలోని కొన్ని విభాగాలను తగ్గించుకునే యోచనలో గూగుల్ ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనిపై గూగుల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sprit legal notice: మహిళా రైతు నిర్మాత నర్సమ్మ స్పిరిట్ చిత్రానికి ప్రభాస్ కు సంబంధం ఏమిటి?

Narne Nithin: నార్నే నితిన్ #NN5 మూవీ హ్యూమరస్ క్రియేటివ్ పోస్టర్ ద్వారా అనౌన్స్‌మెంట్

Naga Durga : ప్రియదర్శి మూవీలో హీరోయిన్ గా తెలుగు ఫోక్ సాంగ్స్ ఫేమ్ నాగదుర్గ

Suriya: విశ్వనాథ్ & సన్స్ చిత్రం తొలి గీతం నేనో బటర్‌ఫ్లై

Prabhas: మాటలు లాంటి పాటలతో తీశాం గట్టిగా చెప్పు అంటున్న ప్రభాస్

తర్వాతి కథనం