కరోనా కల్లోలం : వర్క్ ఫ్రమ్ హోంను పొడగించిన గూగుల్

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (09:37 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వేగం ఏమాత్రం తగ్గడం లేదు. పైగా, పలు దేశాల్లో ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ వైరస్ బారినపడిన అనేక దేశాలు ఇప్పటికీ కోలుకోలేదు. ఇలాంటి దేశాల్లో భారత్ కూడా ఉంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వెసులుబాటును కల్పించాయి. అలాంటి వాటిలో టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఒకటి. 
 
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గూగుల్ సంస్థ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను పొడిగించింది. త‌మ ఉద్యోగుల కోసం ఇంటి నుంచి ప‌నిచేసే సౌల‌భ్యాన్ని వ‌చ్చే యేడాది జూన్ 30వ తేదీ వ‌ర‌కు పొడ‌గిస్తున్న‌ట్లు గూగుల్ సంస్థ వెల్ల‌డించింది. గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెట్ సంస్థ‌.. ఆఫీసులో ప‌ని అవ‌స‌రం లేని వారికి వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను పొడిగిస్తున్న‌ట్లు చెప్పింది. 
 
వాస్త‌వానికి ఈ ఏడాది జూన్‌లో ఆఫీసులు తెరువాల‌నుకుంటున్న‌ట్లు మొద‌ట్లో గూగుల్ ప్ర‌క‌టించింది. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ వ‌ర్క్ హోమ్ కాన్సెప్ట్‌ను ఎంక‌రేజ్ చేసింది. ఈ ఏడాది చివ‌ర వ‌ర‌కు తమ ఉద్యోగులు ఇంటి నుంచి ప‌నిచేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను వ‌చ్చే ఏడాది జూన్ చివ‌ర వ‌ర‌కు పొడగించి, ఉద్యోగులకు వెసులుబాటును కల్పించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments