Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌.. లోన్ పొందడం కూడా ఇక సులభమే..?

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (20:46 IST)
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ ఊపందుకోనుంది. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు మరో బెనిఫిట్ కూడా అందిస్తోంది. సులభంగానే రుణాలు ఆఫర్ చేస్తోంది. దీని కోసం ఫ్లిప్‌కార్ట్ పలు కంపెనీలతో జతకట్టింది. 
 
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐతో కూడా ఫ్లిఫ్ కార్ట్ జతకట్టింది. ఎస్‌బీఐ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఉపయోగించే వారు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోళ్ల ద్వారా 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు. ఇంకా బజాజ్ ఈఎంఐ కార్డు కలిగిన వారు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ పొందొచ్చు. అక్టోబర్ 21 వరకు ప్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అందుబాటులో ఉంటుంది.
 
ఇందుకోసం 17 బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఫిన్‌టెక్ సంస్థలతో జతకట్టింది. ఇందులో భాగంగా కస్టమర్లకు సులభంగా రుణాలు పొందవచ్చు. తద్వారా  ఫ్లిప్‌కార్ట్‌లో ప్రొడక్టులు కొనొచ్చు.
 
ప్రతి భారతీయుడికి తక్కువ వ్యయంలోనే షాపింగ్ అనుభూతి కల్పించాలనే లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అందుకే 17 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్ కంపెనీల ద్వారా కస్టమర్లకు సులభంగానే రుణాలు అందిస్తున్నామని పేర్కొంది. 7 కోట్ల మందికి లోన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments