Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో పాకిస్థాన్ దొంగలు.. 'రాన్సమ్‌వేర్'తో సమాచారం తస్కరణ

హైదరాబాద్‌లోని ఐటి కంపెనీల్లో దొంగలుపడ్డారు. రాన్సమ్‌వేర్‌ను ఉపయోగించి పలు కంపెనీల్లోని విలువైన సమాచారాన్ని తస్కరించారు. సమాచారాన్ని తస్కరించడం గత పది రోజులుగా సాగుతోంది. ఇదే అంశంపై సొసైటీ ఫర్ సైబరాబా

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (14:59 IST)
హైదరాబాద్‌లోని ఐటి కంపెనీల్లో దొంగలుపడ్డారు. రాన్సమ్‌వేర్‌ను ఉపయోగించి పలు కంపెనీల్లోని విలువైన సమాచారాన్ని తస్కరించారు. సమాచారాన్ని తస్కరించడం గత పది రోజులుగా సాగుతోంది. ఇదే అంశంపై సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సిఎస్‌సి) ప్రతినిధి మాట్లాడుతూ పాకిస్థాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు గత పది రోజులుగా హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలపై సైబర్ దాడులు చేస్తున్నట్టు చెప్పారు. 
 
'రాన్సమ్‌వేర్'ను ఉపయోగించి వాళ్లు సమాచారాన్ని దొంగిలించారని, దీనిపై దర్యాప్తు మొదలైందని చెప్పారు. డీక్రిప్షన్ కీలు కావాలంటే పెద్దమొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. టర్కీ, సోమాలియా, సౌరీ అరేబియా వంటి దేశాల్లో ఉన్న సెర్వర్లను ఉపయోగించుకుని పాక్ హ్యాకర్లు ఈ దాడులు చేశారని సైబర్ సెక్యూరిటీ ఫోరం అధికారులు వెల్లడించారు. 
 
ఈ హ్యాకర్ల దాడిపై కొన్ని ఐటీ సంస్థలు నేరుగా ఈ విషయాన్ని ఎస్‌సిఎస్‌సికి ఫిర్యాదుచేయగా, మరికొన్ని ప్రైవేట్ సైబర్ సెక్యూరిటీ సంస్థల ద్వారా కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చాయి. అయితే సంస్థల భద్రత దృష్ట్యా ఏయే కంపెనీలపై సైబర్ దాడులు జరిగాయో మాత్రం వెల్లడించడం లేదు. సైబరాబాద్ పరిధిలో మొత్తం 2,500 ఐటీ కంపెనీలు ఉన్నాయి. వాటిలో 1300 పెద్ద కంపెనీలు. ఇవి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కాం)లో రిజిస్టరై ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా తమ సేవలు అందిస్తుంటాయి. ప్రధానంగా వీటి క్లయింట్స్ అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఉన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments