Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది ఫేక్ వీడియో.. రెడ్‌మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ పేలిపోలేదు.. మను జైన్ ప్రకటన

షియోమీ కంపెనీకి చెందిన రెడ్‌మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ పేలినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ సంస్థ ఇండియా హెడ్ మను జైన్ వెల్లడించారు. బెంగళూరులోని ఓ షోరూమ్‌లో షియోమీకి చెందిన రెడ్ మీ నోట్ 4 పేలినట్లు

Webdunia
బుధవారం, 26 జులై 2017 (10:26 IST)
షియోమీ కంపెనీకి చెందిన రెడ్‌మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ పేలినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ సంస్థ ఇండియా హెడ్ మను జైన్ వెల్లడించారు. బెంగళూరులోని ఓ షోరూమ్‌లో షియోమీకి చెందిన రెడ్ మీ నోట్ 4 పేలినట్లు వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ వీడియో ఫేక్ అంటూ మను జైన్ వెల్లడించారు.  పేలింది రెడ్‌మీ నోట్ 4 కాదని స్పష్టం చేశారు. 
 
మొబైల్‌లో సిమ్‌కార్డు పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలిపోయినట్టు వీడియో ఫుటేజీ ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇది రెడ్‌మీ నోట్ 4 ఫోనేనంటూ వార్తలు చక్కర్లు కొట్టడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనిపై స్పందించిన మను.. షియోమీ పేలిందనే దానిపై విచారణ చేపట్టామని.. పేలిన ఫోన్ నోట్ 4 కాదని.. ఇంకా అది తమ కంపెనీకి చెందిన ఏ బ్రాండూ కాదన్నారు. 
 
పూర్వికా మొబైల్ స్టోరులో పేలిన ఫోను తమది కాదని.. యూట్యూబ్ క్రియేటర్స్ కావాలనే తమ బ్రాండుపై మచ్చ తెచ్చేందుకు ఈ పని చేశారని మను చెప్పారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుగుతుందని చెప్పుకొచ్చారు. వేరేదో కంపెనీకి చెందిన ఫోన్ పేలితే రెడ్ మీ నోట్ ఫోర్‌ పేలినట్లు కథలు అల్లారన్నారు. వీడియో మొత్తం ఫేక్ అని తెలిపారు. గత ఏడాది శామ్‌సంగ్ గాలెక్సీ నోట్ 7 ఫోన్లు పేలడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments