Webdunia - Bharat's app for daily news and videos

Install App

200 కోట్ల యూజర్ల మార్క్‌కు చేరుకున్న ఫేస్ బుక్.. 2012 ఆ రికార్డు బద్ధలు..

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ తాజాగా 200 కోట్ల యూజర్ల మైలురాయిని దాటింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో 200 కోట్ల మంది యూజర్లు ఉన్నారని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వ

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (11:11 IST)
ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ తాజాగా 200 కోట్ల యూజర్ల మైలురాయిని దాటింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో 200 కోట్ల మంది యూజర్లు ఉన్నారని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రపంచాన్ని అనుసంధానం చేయడంలో తాము ఎల్లప్పుడూ ప్రగతి సాధిస్తున్నామని చెప్పుకొచ్చారు. 
 
ఫలితంగా యూజర్లు ఒకరికొకరు మరింత దగ్గరవుతున్నారని, వారితో తమ జర్నీ కొనసాగుతుందని జుకర్ బర్గ్ తన పోస్టులో రాశారు. కాగా 200 కోట్ల యూజర్ల మార్క్‌కు చేరుకున్న సందర్భంగా ఫేస్‌బుక్ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. తమ యూజర్ బేస్ కూడా ఏదైనా ఒక దేశం జనాభా కంటే కూడా అధికమని  జుకర్ బర్గ్ వెల్లడించింది. ఫేస్ బుక్ సాధించిన ఈ మైలురాయిలో ఇన్ స్టాగ్రామ్ లేదా వాట్సాప్ నెట్ వర్క్ యూజర్లను కలుపలేదని కంపెనీ చెప్పింది. 
 
మార్చి 31 వరకు ఫేస్ బుక్‌కు 1.94 బిలియన్ యూజర్లున్నారు. గతేడాది కంటే ఇది 17 శాతం ఎక్కువ. 2012లో అక్టోబర్‌లో తొలిసారి ఫేస్ బుక్ 100 కోట్ల మైలురాయిని చేధించింది. ప్రస్తుతం మరో కొత్త మైలురాయి 200 కోట్లను ఫేస్ బుక్ అధిగమించింది.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments