Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌లో న్యూ ఫీచర్.. ఇప్పటికి అక్కడ మాత్రమే..

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (11:24 IST)
సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ఫేస్‌బుక్‌ల సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే, ప్రస్తుతానికి ఈ న్యూ ఫీచర్ భారత్‌లో అందుబాటులోకి రాలేదు. కేవలం అమెరికాలోని ఫేస్‌బుక్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 
 
ప్రస్తుతం, పోస్టులకు సంబంధించి న్యూస్ ఫీడ్ ఫీచర్ ఉన్నా, తాజా వార్తలు, కథనాల కోసం ప్రత్యేకంగా న్యూస్ విభాగాన్ని ప్రారంభిస్తోంది. ప్రస్తుతానికి ఇది పైలెట్ ప్రాజెక్టుగా అమెరికాలో కొద్దిమంది యూజర్లకు అందుబాటులోకి తీసుకునిరానుంది. ఆపై మరింత మెరుగుపరిచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఫేస్‌బుక్ యాజమాన్యం ప్రకటించింది. 
 
మరోవైపు, స్థానిక మీడియా సంస్థల కథనాలు, పాత్రికేయులు ఎంపిక చేసిన కథనాలకు ఫేస్‌బుక్ న్యూస్ విభాగంలో చోటు కల్పిస్తారు. ప్రత్యేకమైన ఆల్గోరిథమ్ ద్వారా యూజర్ల అభిరుచులకు అనుగుణంగా వార్తలు కనిపించేలా ఈ న్యూస్ విభాగాన్ని తీర్చిదిద్దుతున్నారు. అంతేకాదు, పెయిడ్ న్యూస్ సబ్ స్క్రిప్షన్లను ప్రచారం చేసుకునే వారికి అనువుగా ఇందులోనే ప్రత్యేక విభాగం ఉంటుంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments