Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇపుడు డెల్ వంతు ... 6500 మంది ఉద్యోగులను ఇంటికి

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (12:12 IST)
ప్రముఖ టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే అనేక టెక్ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఇపుడు మరో కంపెనీ సిద్ధమైంది. కంప్యూటర్ల తయారీలో దిగ్గజ కంపెనీ గుర్తింపు పొందిన డెల్ కంపెనీ 6500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డెల్ ఉద్యోగుల్లో ఐదు శాతం మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు.
 
ఇదే అంశంపై డెల్ సహ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లార్క్ పేరిట ఓ సర్క్యులర్ జారీ అయింది. అందులో "ఒడిదుడుకులతో కూడిన మార్కెట్ పరిస్థితులను ప్రస్తుతం డెల్ కూడా ఎదుర్కొంటుంది. అనిశ్చితితో కూడిన భవిష్యత్తు క్షీణదిశ వైపు పయనిస్తుంది. గతంలోనూ ఆర్థిక మాంద్యాన్ని చవిచూశాం. కానీ, మరింత బలంగా తయారయ్యాం. ఇపుడు కూడా అంతే. మార్కెట్ పుంజుకోగానే మళ్లీ పూర్వస్థితిని అందుకుంటాం" అని ఆ సందేశంలో పేర్కొన్నారు. 
 
కాగా కరోనా మహమ్మారి కారణంగా 2022 నాలుగో త్రైమాసికంలో పర్సనల్ కంప్యూటర్ విక్రయాలు పడిపోవడంతో అనేక కంప్యూటర్ తయారీ కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయని టెక్ అనలిస్ట్ ఐడీసీ వెల్లడించింది. డెల్ కూడా ఇతర కంపెనీల బాటలోనే నడుస్తుంది. 2021 నాలుగో త్రైమాసికంతో పోల్చితే 2022 త్రైమాసికంలో 37 శాతం నష్టాలను చవిచూసిందని ఐడీసీ వెల్లడించింది. 
 
కాగా, డెల్ కంపెనీని వచ్చే ఆదాయంలో 55 శాతం ఆదాయం పర్సనల్ కంప్యూటర్ విక్రయం ద్వారానే వస్తుంది. ఇపుడు ఈ తరహా కంప్యూటర్ల విక్రయం గణనీయంగా తగ్గింది. దీంతో ఆ కంపెనీ ఆదాయంలో కూడా భారీ క్షీణత కనిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments