Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీ ట్వీట్‌ను డిలీట్ చేసిన ట్విట్టర్

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (11:21 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్‌ను ట్విట్టర్ ఇండియా తొలగించింది. ఢిల్లీలో అత్యాచారం మరియు హత్య కేసు బాధితురాలి తల్లిదండ్రులను కలిసిన ఫోటోను రాహుల్ గాంధీ షేర్ చేశారు. ఈ చిత్రంలో  బాధితురాలి తల్లిదండ్రుల ముఖాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) ట్విట్టర్‌కు నోటీసులు ఇచ్చింది. రాహుల్ గాంధీ ట్విట్టర్ హ్యాండిల్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది.
 
ట్విట్టర్ ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్‌కు చిల్డ్రన్స్ కమిషన్ రాసిన లేఖలో, మైనర్ బాధితుల కుటుంబ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015 సెక్షన్ 74 మరియు బాల లైంగిక నిరోధం సెక్షన్ 23 కింద నేరం.. నేరాల చట్టం (POCSO) ఉల్లంఘన కూడా అని చెప్పింది. ముఖ్యంగా అత్యాచార బాధితురాలి ఫోటోను, వారి ఐడెంటిటీని బహిర్గతం చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని కమిషన్ స్పష్టంచేసింది.
 
ఈ విషయమై ట్విట్టర్ ఇండియా స్పందించింది. రూల్స్‌కు వ్యతిరేకంగా పోస్ట్ ఉన్నట్లు గుర్తించామని, ట్వీట్‌ను తొలిగిస్తున్నట్లుగా నోటిఫికేషన్ ద్వారా రాహుల్ గాంధీకి సమాచారం ఇచ్చి ట్వీట్‍ను తొలిగించింది.
 
ఢిల్లీలోని కాంట్ ప్రాంతంలో 9 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించగా.. 55 ఏళ్ల వయసున్న ఓ పూజారి, మరో ముగ్గురు బాలికను హత్య చేసి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో చనిపోయినట్లుగా చిత్రీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వారికి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టారు. బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
 
బిడ్డ మృతిపై అనుమానాలు రావడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఒక పూజారి సహా నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం