Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైజూస్ యజమాని రవీంద్రన్‌పై కేసు.. ఎందుకంటే..?

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (16:47 IST)
Byjus
బైజూస్ యజమాని రవీంద్రన్‌పై కేసు నమోదు అయింది. యూపీఎస్సీ సిలబస్‌‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించారన్న ఆరోపణలతో ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్రిమోఫోబియా అనే సంస్థ చేసిన ఫిర్యాదు ఆధారంగా నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 (ఎ) కింద రవీంద్రన్ పై కేసు నమోదు చేశామని ముంబై పోలీసులు తెలిపారు. 
 
క్రిమియోఫోబియా వ్యవస్థాపకుడు స్నేహిల్ ధాల్.. యూపీఎస్‌సీకి సంబంధించి బైజూస్ తప్పుడు సమాచారాన్ని అందించిందని ఆరోపించారు. యుపీఎస్‌సీ ప్రిపరేటరీ మెటీరియల్‌లో సీబీఐని యుఎన్‌టీఓసీకి నోడల్ ఏజెన్సీగా చెప్పినట్లుగా వెల్లడించారు. 
 
ఈ విషయాన్నిగమనించిన వెంటనే కంపెనీకి అవసరమైన మార్పులు చేయమని కోరుతూ ఒక ఈ-మెయిల్ పంపినా.. బైజూస్‌ సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించారు. 
 
ఈ విష‌య‌మై బైజూస్‌ రవీంద్రన్ స్పందిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌ కాపీని తమ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని తెలిపారు. భారత్ లో బాగా పాపులర్‌ ఎడ్యుకేషనల్‌ యాప్‌గా పేరొందిన బైజూస్‌.. తన సేవలను మరింతగా విస్తరించనుంది. ఇకపై అకడామిక్‌ ఓరియెంటెండ్‌ సర్వీసెస్‌ లను మాత్రమే కాకుండా.. రాబోయే రోజుల్లో ప్రొఫెషనల్‌, సర్టిఫికేట్‌ కోర్సులపై కూడా దృష్టి సారించనుంది. ప్రస్తుతం టీమిండియాకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments