Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎల్ఎల్ స్పషల్ ఆఫర్ : రోజూ 1జీబీ డేటా... 60 రోజుల వ్యాలిడిటీ

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (17:51 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారుల కోసం సరికొత్త రీచార్జ్ ప్లాన్‌‍ను ప్రవేశపెట్టింది. రూ.108తో రీచార్జ్ చేసుకున్న‌వారికి 60 రోజ‌లు కాలపరిమితోపాటు ప్ర‌తి రోజు 1జీబీ డేటాను అందివ్వనుంది. ఇతర ప్రైవేటు కంపెనీలతో పోల్చుకుంటే ఈ ప్లాన్ ఎంతో ఉపయోగరకరంగా ఉంటుందని బీఎస్ఎల్ఎల్ పేర్కొంది. 
 
దేశంలోని ఇతర ప్రైవేటు కంపెనీల కంటే మెరుగైన రీతిలో సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టినట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. 
 
ప్ర‌స్తుతం జియో, ఎయిర్‌టెల్ సంస్థ‌లు త‌మ ప్లాన్‌లో 1జీబీ డేటాను కేవ‌లం 28 రోజుల‌కు లేదా 56 రోజుల కాల‌ప‌రిమితితో ఇస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ త‌న రూ.108 కొత్త ప్లాన్‌లో 1జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఆఫర్‌ను కూడా ఇచ్చింది. 
 
ఒక‌వేళ డెయిలీ డేటా పూర్తి అయితే, అప్పుడు ఇంట‌ర్నెట్ డౌన్‌లోడింగ్‌, అప్‌లోడింగ్ స్పీడ్‌ను 80కేబీపీఎస్‌తో ఇవ్వ‌నున్నారు. ఈ కొత్త ప్యాక్ ఢిల్లీ, ముంబై ఎంటీఎన్ఎల్ నెట్వ‌ర్క్స్‌లో అందుబాటులోకి వ‌చ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments