Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూ ఇయర్ ఆఫర్ - రోజుకు 5 జీబీ డేటాతో బీఎస్ఎన్ఎల్

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (20:42 IST)
కొత్త సంపత్సరంలో మొబైల్ టెలికాం యూజర్లను ఆకర్షించేందుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేట్ టెలికాం కంపెనీలు వివిధ రకాలైన ఆఫర్లను ప్రటిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ప్రతి రోజూ 5 జీబీ డేటాను అందివ్వనుంది. ఇటీవల దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ మొబైల్ టారిఫ్‌లను విపరీతంగా పెంచిన నేపథ్యంలో తాజాగా బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులను మరింతగా ఆర్షించేలా ఈ సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. 
 
రూ.599 విలువ కలిగిన ఈ ప్లాన్ కాల పరిమితి 84 రోజులు. ప్రతి రోజూ 5 జీబీ డేటాను అందిస్తుంది. ఈ లిమిట్ దాటిన తర్వాత 40 కేబీపీఎస్ వేగంతో డేటాను వాడుకోవచ్చు. అంతేకాకుండా, రాత్రి 12 గంటల నుంచి 5 గంటల వరకు ఉచితంగా అపరిమిత డేటాను ఉపయోగించుకునే వెసులుబాటును కల్పించింది. అలాగే, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్‌లను వినియోగించుకోవచ్చు. అలాగే, బీఎస్ఎల్ఎన్‌కు చెందిన కాలర్ ట్యూన్లను, జింగ్ మ్యూజిక్‌ వంటి ఫ్రీ బెనిఫిట్స్‌ను కూడా ప్రకటించింది.
 
రిలయన్స్ జియో నుంచి న్యూ ఇయర్ ఆఫర్స్
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థగా ఉన్న రిలయన్స్ జియో ఇపుడు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తమ సంస్థ వినియోగదారులకు అనేక ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా, రోజుకు 1.5జీబీ డేటా, ఇతర సదుపాయాలతో కూడిన 336 రోజుల ప్లాన్ వ్యాలిడిటీని 29 రోజులకు పెంచి 365 రోజులు చేసింది. 
 
అంటే, జియో వినియోగదారులు ఒక యేడాది ప్లాన్ కింద రూ.2,545కు రీచార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ వర్తిస్తుంది. ఈ ప్లాన్ కింద రోజుకు 1.5 జీబీ హై స్పీడ్ డేటా, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, జియో ఫ్లాట్‌ఫామ్‌పై ఇతర సదుపాయాలు పొందవచ్చు. ఈ ప్లాన్ పాత యూజర్లకే కాకుండా కొత్త కనెక్షన్ పొందిన వినియోగదారులకు కూడా వర్తిస్తుంది. 
 
అలాగే 365 రోజుల వ్యాలిడిటీతో మరో ప్లాన్‌కు జియో అందుబాటులోకి తెచ్చింది. రూ.2,879 రీచార్జ్‌పై 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీపీ డేటాను పొందవచ్చు. ఇందులోనూ రోజు వంద ఎస్ఎంఎస్‌లు, ఇతర సదుపాయాలు పొందవచ్చు. 
 
అలాగే 20 శాతం జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద రూ.719, రూ.666, రూ.299 రీచార్జ్ ప్లాన్లను సైతం అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ల కింద రీచార్జ్ చేసుకునేవారు జియోమార్ట్‌పై చెల్లింపులకు ఉపయోగపడే క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments