Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్‌కు పోటీగా మైక్రోమ్యాక్స్: భారత్-1 పేరిట 4జీ ఫోన్

దేశ వ్యాప్తంగా రిలయన్స్ జియో విడుదల చేసిన 4జీ ఫీచర్ ఫోనుకు పోటీగా మైక్రోమ్యాక్స్ సంస్థ ''భారత్-1'' పేరిట 4జీ ఎల్టీఈ ఆధారిత ఫోన్‌ను విడుదల చేసింది. రిలయన్స్ జియో ఫోను కంటే కాస్త అధికంగా.. అంటే రూ.2,20

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (13:24 IST)
దేశ వ్యాప్తంగా రిలయన్స్ జియో విడుదల చేసిన 4జీ ఫీచర్ ఫోనుకు పోటీగా మైక్రోమ్యాక్స్ సంస్థ ''భారత్-1'' పేరిట 4జీ ఎల్టీఈ ఆధారిత ఫోన్‌ను విడుదల చేసింది.  రిలయన్స్ జియో ఫోను కంటే కాస్త అధికంగా.. అంటే రూ.2,200 లకు లభిస్తుంది. రూ.2,200లకు లభించే ఈ ఫోనులోబీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకుంటే, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ యాక్సెస్, కాలింగ్, ఎస్ఎంఎస్, ఉచిత రోమింగ్ తదితరాలన్నీ నెలకు రూ. 97 రీచార్జ్‌తోనే లభిస్తాయి. 
 
వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రిలయన్స్ జియో ఫీచర్ ఫోనుతో పోలిస్తే భారత్-1 చాలా చౌకగా వచ్చినట్టవుతుందని ఐటీ నిపుణులు అంటున్నారు. రెండేళ్ల పాటు జియో వాడితే.. రూ. 5,172 అవుతుందని, అదే మైక్రోమాక్స్ ఫోన్ భారత్-1 వాడితే రూ. 4,528 మాత్రమే అవుతుందని వారు చెప్తున్నారు. ఇక మూడేళ్ల కాలపరిమితికి పరిశీలిస్తే, జియో ఫోన్‌కు రూ. 6,008 వెచ్చించాల్సి రాగా, భారత్-1కు రూ. 5,692 మాత్రమే అవుతుందని మైక్రోమాక్స్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. 
 
భారత్-1 ఫోన్ ఫీచర్స్.. 
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 2015 ప్రాసెసర్, 
4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 
512 ఎంబీ రామ్ 
2.4 అంగుళాల స్క్రీన్, 
2ఎంపీ, వీజీఏ కెమెరాలు, 
భారత భాషలకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

సంబంధిత వార్తలు

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments