బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ఆఫర్.. రూ.365లతో ప్రీ-పెయిడ్ రీఛార్జ్ ప్లాన్

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (19:04 IST)
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) రూ.365 విలువతో ప్రత్యేకంగా ఓ ప్రీ-పెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ కాలపరిమితి 365 రోజులు. ఇక రోజుకు 250 చొప్పున అపరిమిత వాయిస్ కాల్స్ వెసులుబాటు ఈ ప్లాన్‌లో ఉంది. అలాగే రోజుకు 2జీబీ రోజువారీ డేటాక్యాప్ ఉంది.
 
రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితం. కాగా ఈ 'ఉచితాలు' 60 రోజులు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. దీనిపై మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతోంది. అరవై రోజుల ఉచిత కాలపరిమితి ముగిసిన తర్వాత వాయిస్, డేటా వోచర్స్ అవసరమవుతాయి.
 
ప్రస్తుతం కేరళ, ఆంధ్రప్రదేశ్, అసోం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కోల్‌కతా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు(చెన్నై), చత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్తాన్, యూపీ ఈస్ట్, యూపీ వెస్ట్ వంటి ఎంపిక చేసిన సర్కిల్స్‌లో ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టారు.
 
ఈ ప్లాన్ కింద రెండు నెలల పాటు పలు ఉచితంగా పలు ఆఫర్లను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది. వీటిలో రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్‌తో పాటు 2జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు ఉన్నాయి. రోజులో 2జీబీ డేటా పూర్తయ్యాక ఇంటర్‌నెట్ వేగం 80 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఇవి కేవలం తొలి రెండు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక మిగిలిన పది నెలలూ ఎలాంటి ఆఫర్లు ఉండవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments