Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ బ్రౌజ్‌లో ఆటోఫిల్ ఆప్షన్ ఉందా? అది సైబర్ నేరగాళ్ళ పనే.. తస్మాత్ జాగ్రత్త!

సైబర్ నేరగాళ్లు తమ మేథస్సుకు నిరంతరం పదును పెడుతూనే ఉంటారు. ఆ విధంగా వారు విజయం సాధిస్తుంటారు. తాజాగా వెబ్ బ్రౌజర్‌లో సరికొత్త ఆప్షన్‌ను జోడించి మీ బ్యాంకు ఖాతాలోని సొమ్మును దోచుకుంటున్నారు.

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (14:37 IST)
సైబర్ నేరగాళ్లు తమ మేథస్సుకు నిరంతరం పదును పెడుతూనే ఉంటారు. ఆ విధంగా వారు విజయం సాధిస్తుంటారు. తాజాగా వెబ్ బ్రౌజర్‌లో సరికొత్త ఆప్షన్‌ను జోడించి మీ బ్యాంకు ఖాతాలోని సొమ్మును దోచుకుంటున్నారు. కొన్ని వెబ్‌సైట్లలో రహస్య టెక్ట్స్‌ బాక్సుల ద్వారా ఆటోఫిల్‌ వివరాలను హ్యాకర్లు చోరీ చేస్తున్నట్లు సెక్యూరిటీ నిపుణుల గుర్తించారు. ఆ వివరాలను పరిశీలిస్తే... 
 
నెటిజన్లు వినియోగిస్తున్న వెబ్ బ్రౌజర్లలో ఆటోఫిల్‌ ఆప్షన్‌ ఆన్‌లో ఉంటే ఏదైనా వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ అయినప్పుడు.. లావాదేవీలు నిర్వహించినప్పుడు మన వివరాలన్నీ బ్రౌజర్‌లోనూ స్టోర్‌ అవుతాయి. మళ్లీ ఎప్పుడైనా మన వివరాలు అవసరమున్నప్పుడు పేరు లేదా ఈ-మెయిల్‌ ఐడీని టైప్‌ చేయగానే గతంలో ఇచ్చిన మిగతా వివరాలన్నీ యధావిధిగా బ్రౌజర్‌లో డిస్ప్లే అవుతాయి.
 
చాలామందికి అది ఉపయోగకరంగానే అనిపిస్తుంది. ప్రతిసారీ టైప్‌ చేయాలన్న బాధ తప్పుతుంది అనుకుంటారు. కానీ.. ఆ సమాచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా సైబర్‌ నేరగాళ్లు లాగేసే వీలుందని ఫిన్‌లాండ్‌కు చెందిన ఎథికల్‌ హ్యాకర్‌ విజ్లమి కోస్మనెన్‌ గుర్తించారు. కొన్ని వెబ్‌సైట్లలో రహస్య టెక్ట్స్‌ బాక్సులను ఉంచి.. వ్యక్తిగత వివరాలతోపాటు.. క్రెడిట్‌.. డెబిట్‌ కార్డుల సమాచారాన్నీ సైబర్‌ నేరగాళ్లు సులువుగా చోరీ చేసేస్తారట. గూగుల్‌ క్రోమ్‌.. మొజిల్లా ఫైర్‌ ఫాక్స్‌.. యాపిల్‌ సఫారీ.. ఒపేరా వంటి ప్రముఖ బ్రౌజర్లతోనూ ఈ సమస్య ఉన్నట్లు గుర్తించారు. అందుకే ఆటోఫిల్‌ ఆప్షన్‌ను డిజేబుల్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments