Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో జియో లైసెన్స్‌ను రద్దు చేయాలి: ఎయిర్ టెల్ డిమాండ్

జమ్మూకాశ్మీర్‌లో జియో లైసెన్స్‌ను రద్దు చేయాలంటూ ఎయిర్‌టెల్ డిమాండ్ చేస్తోంది. ఆ రాష్ట్రంలోని తమ వినియోగదారుల్లో 95 శాతం మంది పోస్ట్ పెయిడ్ వినియోగదారులుగా చెబుతోందని, నిజానికి వారంతా ప్రీపెయిడ్ కస్టమ

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (09:16 IST)
జమ్మూకాశ్మీర్‌లో జియో లైసెన్స్‌ను రద్దు చేయాలంటూ ఎయిర్‌టెల్ డిమాండ్ చేస్తోంది. ఆ రాష్ట్రంలోని తమ వినియోగదారుల్లో 95 శాతం మంది పోస్ట్ పెయిడ్ వినియోగదారులుగా చెబుతోందని, నిజానికి వారంతా ప్రీపెయిడ్ కస్టమర్లేనని ఎయిర్‌టెల్ వాదిస్తోంది. నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న జియోతో భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆరోపిస్తోంది. 
 
దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇస్తున్నట్టే వ్యూహాత్మకంగా, ఉద్దేశపూర్వకంగా ఉచిత ఆఫర్లు ఇస్తూ వినియోగదారులను జియో తమవైపు తిప్పుకుంటోందని, తద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఎయిర్‌టెల్ పేర్కొంది. అందుకే వెంటనే జియో లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అయితే ఎయిర్‌టెల్ ఆరోపణలు దురుద్దేశపూర్వకంగా ఉన్నాయని, ప్రతీకార చర్యల్లో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని జియో ఫైర్ అయ్యింది.  
 
ఇదిలా ఉంటే.. జియో కొట్టిన దెబ్బకు ఇప్పటికీ ఇతర టెలికాం సంస్థలు కోలుకోలేదు. అయితే ఇకపై జియో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సంస్థలకు కూడా గట్టి షాకే ఇవ్వనుంది. జియో ఫైబర్ పేరిట త్వ‌ర‌లో సరికొత్త, అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను యూజర్లకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్న‌ట్టు తెలిసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments