హైటెక్ ప్రపంచం.. చేతిలో స్మార్ట్‌ఫోన్. ఇంకేముంది.. పొద్దస్తమానం ఇంటర్నెట్ ప్రపంచంలో యువత మునిగితేలుతోంది. అన్నపానీయాలు, నిద్రహారాలు మానేసి నెట్టిల్లే లోకంగా జీవిస్తోంది. ఇలా పొద్దస్తమానం ఇంటర్నెట్ ఉపయ
హైటెక్ ప్రపంచం.. చేతిలో స్మార్ట్‌ఫోన్. ఇంకేముంది.. పొద్దస్తమానం ఇంటర్నెట్ ప్రపంచంలో యువత మునిగితేలుతోంది. అన్నపానీయాలు, నిద్రహారాలు మానేసి నెట్టిల్లే లోకంగా జీవిస్తోంది. ఇలా పొద్దస్తమానం ఇంటర్నెట్ ఉపయోగించే వారికి ఓ బ్యాడ్ న్యూస్ చెప్పారు నెట్ పరిశోధకులు. తాజాగా వెల్లడైన ఈ పరిశోధనా ఫలితాలను పరిశీలిస్తే...
రోజులో ఎక్కువ సమయం ఇంటర్నెట్ ఉపయోగించే 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న కొంతమందిని ఎంపిక చేసుకుని ఇంటర్నెట్ వాడమని చెప్పారు. ఆ తర్వాత వీరి ఆరోగ్యాన్ని పరిశీలించారు. వీరిలో రక్తపోటు, హృదయ స్పందనల్లో మార్పులను గుర్తించారు. ఇదంతా ఇంటర్నెట్ ప్రభావమేనని వారు అంటున్నారు.
ఇంటర్నెట్‌ను ఎంత ఎక్కువ సేపు ఉపయోగిస్తే అంత ఎక్కువగా రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఇంటర్నెట్‌ను ఏకబిగువునకాకుండా మధ్యలో కొద్దిసేపు విరామం ఇచ్చే వారిలో ఈ ముప్పు కాస్త తక్కువగా ఉందని తెలిపారు. మొత్తంమీద గంటా లేదా రెండు గంటల కన్నా ఎక్కువ సేపు ఇంటర్నెట్‌ను చూడటం ఆరోగ్యానికి తీవ్రమైన హాని చేస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు.