Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాపిల్ ఐ ఫోన్-7.. ఛార్జింగ్ పెట్టి చేతులో పట్టుకుని హాయిగా నిద్రపోయింది.. చేయి కాలిపోయింది.. ఎలా?

స్మార్ట్ ఫోన్లు పేలుతున్నాయని వినేవుంటాం. వీడియోల్లోనో లేదా స్వయంగానే కళ్లారా చూసేవుంటాం. అయితే స్మార్ట్ ఫోన్‌ను ఛార్జ్ చేస్తుంటే చేతులు కాలిపోవడాన్ని విన్నారా? లేకుంటే చూశారా? లేదంటే.. ఈ స్టోరీ చదవండ

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (16:13 IST)
స్మార్ట్ ఫోన్లు పేలుతున్నాయని వినేవుంటాం. వీడియోల్లోనో లేదా స్వయంగానే కళ్లారా చూసేవుంటాం. అయితే స్మార్ట్ ఫోన్‌ను ఛార్జ్ చేస్తుంటే చేతులు కాలిపోవడాన్ని విన్నారా? లేకుంటే చూశారా? లేదంటే.. ఈ స్టోరీ చదవండి. సోషల్ మీడియా ఎఫెక్ట్‌తో స్మార్ట్ ఫోన్లకు బాగా డిమాండ్ పెరిగిపోయిందన్న విషయం తెలిసింది. అలా కొత్తగా వచ్చిన యాపిల్ ఐఫోన్-7 ఓ మహిళకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. 
 
పగలంతా స్మార్ట్ ఫోన్లలో చాటింగ్, సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తూ.. రాత్రిపూట కూడా వచ్చే మెసేజ్‌లను రిసీవ్ చేసుకునేందుకు వీలుగా మొబైల్ ఫోన్‌ను మనం నిద్రించే ప్రాంతానికి అతి చేరువలో పెడుతుంటాం. అయితే అదే ఆ మహిళకు డేంజర్ అయ్యింది. ఐఫోన్‌కు చార్జింగ్ పెట్టి ఆదమరిచి నిద్రించిన ఆమెకు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి.
 
ఎలాగంటే..? ఇటీవల తాను ఐఫోన్-7ను కొన్నానని.. అనుకోకుండా ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి దానిని చేతిలో పట్టుకుని నిద్రపోయానని మెల్ బోర్న్‌కు చెందిన మేలెనీ టాన్ పీలెజ్ చెప్పుకొచ్చింది. మంచి నిద్రలో ఏదో తీవ్ర నొప్పిగా ఉందని లేచి చూస్తే.. తన చేతికి తీవ్రంగా కాలిన గాయాలు కావడం చూసి విస్తుపోయానని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ వివరాలను సిడ్నీ హెరాల్డ్ పత్రిక కూడా ప్రచురించింది. 
 
అందుకే నిద్రించేటప్పుడు సెల్ ఫోన్‌లను దూరంగా పెట్టాలని.. ముఖ్యంగా చార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్లను వాడటం, నిద్రించేటప్పుడు పక్కనే పెట్టుకోవడం సరికాదని టాన్ పీలెజ్ ఫేస్ బుక్‌లో తెలిపింది. ఇంకా మేలెనీ ఐఫోన్ వల్ల తన చేతికి తీవ్రంగా కాలిన గాయాలైన ఫొటోను పోస్టు చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments