Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిపలుచగా ఉండే యాపిల్ ఐ ఫోన్.... మార్కెట్‌లోకి...

Webdunia
బుధవారం, 10 సెప్టెంబరు 2014 (13:14 IST)
యాపిల్ సంస్థ తన కలను నిజం చేసుకుంది. ముందుగా ప్రకటించినట్టుగానే ఐ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఏ ఒక్కరినీ నిరాశకు గురి చేయరాదని భావించిన తన పాత సంప్రదాయం ప్రకారం తన కొత్త ఉత్పత్తిని మంగళవారం విడుదల చేసింది. ఐఫోన్ 6 పేరిట కొత్త మొబైల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇప్పటి వరకు విడుదల చేసిన ఐఫోన్ లన్నింటిలోకీ ఐఫోన్ 6 అత్యున్నతమైనదని ఆ సంస్థ ప్రకటించింది. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ పేరిట రెండు వెర్షన్లలో విడుదలైన రెండు ఐఫోన్లు ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల మార్కెట్లలో అందుబాటులోకి రానున్నాయి. 
 
అమెరికాలో మాత్రం ఈ నెల 19 నుంచి వినియోగదారులకు తమ కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తేనున్నట్లు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు. అమెరికాలోని కుపర్టినిలో కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో ఐఫోన్ 6, 6 ప్లస్‌లను విడుదల చేసిన టిమ్ కుక్, ఐవాచ్‌ను కూడా విడుదల చేశారు. అమెరికాలో ఐఫోన్ 6 ధర 199 డాలర్ల నుంచి ఫ్రారంభంకానుండగా, ఐఫోన్ 6 ప్లస్ ధర 299 డాలర్ల నుంచి ప్రారంభం కానుంది. ఇక కొత్త ఉత్పత్తి ఐవాచ్ ధరను మాత్రం యాపిల్ వెల్లడించలేదు. 
 
ప్రపంచ మొబైల్ వినియోగదారులను నెలల తరబడి వేచి చూసేలా చేసిన ఐఫోన్ 6 స్క్రీన్ 4.7 అంగుళాలు, ఐఫోన్ 6 ప్లస్ స్క్రీన్ 5.5 అంగుళాలుగా ఉంది. ఇప్పటిదాకా అందుబాటులోకి వచ్చిన ఐఫోన్లన్నింటిలోకి ఐఫోన్ 6 అతి పలుచగా ఉండటంతో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే, భారత్‌లో మాత్రం ఈ తరహా ఫోన్లు వచ్చే నెల 17వ తేదీన వస్తాయని భావిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments