Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ సేవలు

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (16:19 IST)
కొత్త సంవత్సరం ఆరంభం కాకముందే ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్‌ చేసుకోవచ్చునని ప్రకటించింది. 
 
డిసెంబర్ 31తో ఐయూసీ అమలు గడువు ముగుస్తుండటంతో జియో మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఐయూసీ విధానం రద్దయిన తర్వాత మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ సేవలను పునరుద్ధరిస్తామని గతంలో చెప్పినట్లు జియో ప్రకటించింది. 1, 2021 నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా జియో ద్వారా ఉచిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు అని ప్రకటించింది. 
 
అయితే ఒక నెట్‌వర్క్‌ నుంచి మరో మొబైల్ నెట్‌వర్క్‌కు ఫోన్ చేసినప్పుడు ఇన్ కమింగ్ నెట్‌వర్క్‌కు కాల్‌ చేసిన నెట్‌వర్క్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జెస్‌ అంటారు. ఈ విధానాన్ని జనవరి 1 2020 నుంచి తొలగించడానికి కేంద్రం సమ్మతించింది. అయితే ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా దీన్ని వ్యతిరేకించడంతో పొడగిస్తూ 2019 సెప్టెంబరులో ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments